AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రిన్స్‌తో కానిది.. దేవరకొండతో పూరి మార్క్ ‘జనగణమన’!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్… ఇటీవల జరిగిన ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్‌లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. దీనితో హీరో, దర్శకుడి ఫ్యాన్స్ మధ్య నెట్టింట్లో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. పూరి ప్లాప్స్‌లో ఉన్నప్పుడే మహేష్ ఛాన్స్ ఇచ్చాడని హీరో ఫ్యాన్స్ అంటుంటే.. ఫామ్‌లో ఉన్నా కూడా కనీసం కథ వినేందుకు టైం ఇవ్వలేదని దర్శకుడి అభిమానులు అంటున్నారు. ఇలా ఎవరి […]

ప్రిన్స్‌తో కానిది.. దేవరకొండతో పూరి మార్క్ 'జనగణమన'!
Ravi Kiran
|

Updated on: Jul 22, 2019 | 3:20 PM

Share

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్… ఇటీవల జరిగిన ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్‌లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. దీనితో హీరో, దర్శకుడి ఫ్యాన్స్ మధ్య నెట్టింట్లో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. పూరి ప్లాప్స్‌లో ఉన్నప్పుడే మహేష్ ఛాన్స్ ఇచ్చాడని హీరో ఫ్యాన్స్ అంటుంటే.. ఫామ్‌లో ఉన్నా కూడా కనీసం కథ వినేందుకు టైం ఇవ్వలేదని దర్శకుడి అభిమానులు అంటున్నారు. ఇలా ఎవరి వెర్షన్స్ వాళ్ళవి.. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్.

ఈ పరిస్థితులు చూస్తుంటే మహేష్ బాబు ఇకపై పూరి జగన్నాధ్‌కు ఛాన్స్ ఇచ్చేలా కనిపించట్లేదు. అప్పుడెప్పుడో ఏదో చిన్న ఇష్యూ వల్ల దర్శకుడు సుకుమార్ సినిమానే వదులుకున్న మహేష్… పూరితో సాఫ్ట్‌గా ఉంటాడు అని అనుకోవడం పొరబాటే. ఇది ఇలా ఉండగా గతంలో మహేష్ బాబుతో ‘జనగణమన’ సినిమాను తెరకెక్కించాలని చూసిన పూరి.. ఇప్పుడు రౌడీ విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసే దిశగా ఆలోచిస్తున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ప్రస్తుతం ఆయన తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఏ రేంజ్ హిట్ సాధించిందో తెలియాలంటే ఇంకా కొద్దిరోజులు ఆగాల్సి ఉంది. అయితే ఇంకా మొదటి వారం కాకముందే ఈ సినిమా ఇండస్ట్రీలో హిట్ అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’పై పూర్తి క్లారిటీ రావాలంటే ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయితేనే చెప్పగలం. అప్పుడు కూడా ఇదే కోవలో కొనసాగితే.. ఖచ్చితంగా సూపర్ హిట్ అని చెప్పవచ్చు.

ఇలాంటి తరుణంలో రౌడీ విజయ్ దేవరకొండ.. పూరి జగన్నాధ్ ‘జనగణమన’కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి. అటు విజయ్ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’.. క్రాంతి మాధవ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండిట్లో ‘డియర్ కామ్రేడ్’ జూలై 26న విడుదల కానుంది. అటు పూరి జగన్నాధ్ కూడా ఈ సినిమా తర్వాత రెండు నెలలు బ్రేక్ తీసుకుంటానని చెప్పాడు. మరి ఆ తర్వాత రౌడీ ఓకే చెబితే.. ‘జనగణమన’ నాలుగు నెలల్లోనే కంప్లీట్ చేసే సత్తా పూరి జగన్నాధ్‌కు ఉందన్న విషయం అందరికి తెలిసిందే.

Follow Us
ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో గుండ్రటి రంధ్రం వెనుక ఇంత పెద్ద స్టోరీ
ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో గుండ్రటి రంధ్రం వెనుక ఇంత పెద్ద స్టోరీ
బుల్లెట్ బండి కోసం ఆటో నిండా పైసలతో షోరూమ్‌కు.. అసలు ట్విస్ట్..
బుల్లెట్ బండి కోసం ఆటో నిండా పైసలతో షోరూమ్‌కు.. అసలు ట్విస్ట్..
షుగర్ టెస్ట్ రిపోర్ట్ నార్మల్ గా ఉందా? అయినా ప్రమాదమే
షుగర్ టెస్ట్ రిపోర్ట్ నార్మల్ గా ఉందా? అయినా ప్రమాదమే
అవినీతి చేయనంతవరకు నా ఆటిట్యూడ్ మారదు- ఎంపీ అరవింద్
అవినీతి చేయనంతవరకు నా ఆటిట్యూడ్ మారదు- ఎంపీ అరవింద్
భోపాల్‌లో రామ్ చరణ్ 'పెద్ది కా ఆవాజ్' గ్రాండ్ ఈవెంట్..లైవ్ వీడియో
భోపాల్‌లో రామ్ చరణ్ 'పెద్ది కా ఆవాజ్' గ్రాండ్ ఈవెంట్..లైవ్ వీడియో
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలు..!
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలు..!
LPG చౌకగా లభించే అవకాశం! ఎలాగంటే?
LPG చౌకగా లభించే అవకాశం! ఎలాగంటే?
పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌ల జోష్‌లో ఆ డ్రింక్స్‌ తాగుతున్నారా?
పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌ల జోష్‌లో ఆ డ్రింక్స్‌ తాగుతున్నారా?
జబర్దస్త్ దీవెన ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఏం చేస్తుందంటే?
జబర్దస్త్ దీవెన ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఏం చేస్తుందంటే?
నీ సేవలకి చాలు.. సారథికి షాకిచ్చేందుకు సిద్ధమైన చెన్నై..?
నీ సేవలకి చాలు.. సారథికి షాకిచ్చేందుకు సిద్ధమైన చెన్నై..?