
రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శుక్రవారం (ఆగస్టు 26) ఈ సినిమా పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజ్ కానుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఈ సినిమా రిలీజ్ కానుండడం విశేషం. దీంతో మొదటి రోజు టాక్సిక్ సినిమాకు వచ్చే కలెక్షన్లు, రికార్డులపై అప్పుడే చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున టాక్సిక్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఏకంగా ఐదు గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ యశ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన కంటెంట్ ను బట్టి చూస్తే.. ఇందులో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో పాటు బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉందని తెలుస్తోంది. ఇందులో నయనతార యశ్ కు సోదరిగా గంగ అనే పాత్రలో నటిస్తోంది. సినిమాలో ఈ రోల్ చాలా కీలకమని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు కూడా. అయితే ఆ పాత్ర కోసం ముందుగా ఓ స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేశారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారట. అయితే ఉన్నట్లుండి సదరు హీరోయిన్ ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్.
టాక్సిక్ సినిమాలో యశ్ రాయ, టికెట్ అనే రెండు పాత్రలు పోషిస్తున్నాడు. ఇక రాయ కు సోదరి గా గంగ పాత్రలో నయనతార నటిస్తోంది. మొదట ఈ పాత్ర కోసం పలువురు హీరోయిన్లను పరిశీలించారట. చివరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ను ఫైనల్ చేశారట. టాక్సిక్ సినిమాలో నటిస్తున్నట్లు స్వయంగా కరీనానే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత అనూహ్యంగా కరీనా తప్పుకుంది. దీనికి కారణాలు విశ్లేషిస్తే.. స్టార్ హీరో అయిన యశ్ కు సోదరిగా తాను నటించలేనందట కరీనా. ఒకవేళ ఛాన్స్ వస్తే.. హీరోయిన్‌గా నటిస్తానని చెప్పి టాక్సిక్ సినిమా నుంచి వైదొలిగిందట కరీనా. ఆ తర్వాత నయనతార లైన్లోకి వచ్చిందట. మొదట నయన్ కూడా ఈ పాత్రకు ఒప్పుకోలేదట. అయితే డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గంగ పాత్రలో ఉన్న ఇంటెన్స్, ఇంపార్టెన్స్ ను నయన్ కు వివరించిందట. దీంతో లేడీ సూపర్ స్టార్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి