Prabhas: ఏంటీ బాసూ ఆ స్పీడ్..! మరో సినిమాకు ఒకే చెప్పిన రెబల్ స్టార్.. దర్శకుడు ఎవరంటే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. డార్లింగ్ నటించే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారో చెప్పక్కర్లేదు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు డార్లింగ్. గతేడాది కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబ్, డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు.

Prabhas: ఏంటీ బాసూ ఆ స్పీడ్..! మరో సినిమాకు ఒకే చెప్పిన రెబల్ స్టార్.. దర్శకుడు ఎవరంటే
Prabhas

Updated on: Feb 26, 2025 | 7:29 AM

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం లైనప్ చేసిన సినిమాల షూటింగ్ పూర్తవ్వడానికి చాలా సమయం పడుతుంది. రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ అరడజను సినిమాలను ఓకే చేశారు. సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రభాస్. ఆతర్వాత కల్కి సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. కల్కి తర్వాత ప్రభాస్ నటించిన హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’. ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. చిత్ర బృందం స్వయంగా ఈ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత సలార్ 2, కల్కి 2 కూడా పట్టాలెక్కనున్నాయి. వీటితోపాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ పనులు కూడా మొదలవ్వనున్నాయి.

ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాను లైనప్ చేసిన విషయం  తెలిసిందే. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్ తో బిజీగా మారిన ప్రభాస్. ఇప్పుడు మరో దర్శకుడికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు హనుమాన్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ. ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ తోనూ సినిమా చేయనున్నాడని ఇండస్ట్రీ టాక్.

అంతే కాదు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించే అవకాశా లున్నాయి.  శివరాత్రి సందర్భంగా ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమన్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘సలార్‌’ రీ రిలీజ్‌తో మార్చి 21న థియేటర్లలో సందడి చేయనున్నారు. మరోసారి సలార్ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి