
సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘రావు బహదూర్’. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్స్, గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. దీనికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా నిర్మించడంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాకు భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జులై 03న పెద్ద ఎత్తున రావ్ బహదూర్ సినిమా రిలీజైంది. అయితే సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ చాలా మంది ఆడియెన్స్ కు కనెక్ట్ కాలేదు. సినిమా కథ కథనాలు డిఫరెంట్ గా ఆకట్టకునేలా ఉన్నా స్క్రీన్ ప్లే నాసిరకంగా ఉందని నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం అద్దరిపోయిందని ప్రశంసలు వస్తున్నాయి. అతని నటనకు నేషనల్ అవార్డు ఇచ్చినా తక్కువే అని విమర్శకులు కూడా సత్యదేవ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ రావు బహదూర్ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే..
రావు బహదూర్ సినిమాకు వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. గతంలో కేరాఫ్ కంచరపాలెం లాంటి సూపర్ హిట్ సినిమాను తీశారు వెంకటేష్ మహా. అలాగే సత్యదేవ్ తో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి డిఫరెంట్ మూవీని కూడా తెరకెక్కించారు. ఇప్పుడు అదే సత్యదేవ్ తో రావు బహదూర్ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు హీరోగా సత్యదేవ్ మొదటి ఆప్షన్ కాదట. డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ సినిమాను మొదట న్యాచురల్ స్టార్ నానితో చేయాలని అనుకున్నారట. అందుకు తగ్గట్టే నాని ని కలిసి స్టోరీ ని వివరించగానే , ఆయనకు కూడా కాన్సెప్ట్ బాగా నచ్చిందట. అయితే ఎందుకో కానీ ఈ మూవీ చేసేందుకు నాని ఇంట్రెస్ట్ చూపించలేదట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఒక వేళ రావు బహదూర్ సినిమాను నాని చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదోనని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.
ఇక రావు బహదూర్ సినిమా విషయానికి వస్తే.. జి.ఎమ్.బి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో, A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళ నటి దీపా థామస్ హీరోయిన్ గా నటించింది. వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్, ప్రణయ్ వాకా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి