Kareena Kapoor Khan: ముచ్చటగా మూడో బిడ్డకు జన్మనివ్వనున్న బాలీవుడ్ బ్యూటీ కరీనా.?

|

Jul 17, 2022 | 6:47 PM

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరాల  లేదు. హిందీలో ఒకానొక సమయంలో కరీనా హావ నడిచింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోయింది ఈ చిన్నది.

Kareena Kapoor Khan: ముచ్చటగా మూడో బిడ్డకు జన్మనివ్వనున్న బాలీవుడ్ బ్యూటీ కరీనా.?
Kareena Kapoor
Follow us on

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్(Kareena Kapoor Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరాల  లేదు. హిందీలో ఒకానొక సమయంలో కరీనా హావ నడిచింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోయింది ఈ చిన్నది. ఆ కెరీర్ పీక్ లో ఉండగానే స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను పేమించి పెళ్లాడింది. తన కంటే చాలా ఏళ్ళు పెద్దవాడైన సైఫ్ తో కరీనా ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్ గా అయిన విషయం తెలిసిందే. ఇక సైఫ్ కరీనాకు ఇప్పటికే ఇద్దరు కుమారులు రీసెంట్ గానే రెండో బిడ్డకు జన్మనించింది కరీనా. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు ఈ బ్యూటీ. వీలు చిక్కినప్పుడల్లా సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కరీనాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కరీనా కపూర్ ముచ్చటగా మూడో బిడ్డకు జన్మనివ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో గర్భం దాల్చిన సమయంలో కరీనా సినిమాలు, యాడ్ లకు కూడా హాజరయ్యింది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లలో పాల్గొంది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడు రీసెంట్ గా లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటించింది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ త్వరలోనే ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. మరి ఈ ప్రమోషన్స్ లో కరీనా పాల్గొంటుందో లేదో చూడాలి. ఇక కరీనా మూడో బిడ్డకు జన్మనివ్వనుందన్న వార్తల పై కూడా ప్రమోషన్స్ టైం లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి