
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మెగా మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. పక్కా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న పెద్దిలో రామ్ చరణ్ క్రికెటర్ గానూ, కుస్తీ యోధుడిగానూ కనిపించనున్నాడు. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన టీజర్ మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. అంతకు ముందు వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ కు కూడా
సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ కు దగ్గర పడుతోన్న సమయంలో ఈ మెగా మూవీ గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. పెద్ది సినిమాకు రామ్ చరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదంట. రామ్ చరణ్ కంటే ముందే బుచ్చిబాబు ఈ కథను నలుగురు స్టార్ హీరోలకు వినిపించారట. అయితే వివిధ కారణాలతో వాళ్లు నో చెప్పారట. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. పెద్ది సినిమాను రిజెక్ట్ చేసిన హీరోల్లో ఒక బాలీవుడ్ స్టార్ కూడా ఉన్నాడట.
బుచ్చిబాబు పెద్ది సినిమాను మొదట జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడట. అయితే అప్పటికే ఎన్టీఆర్ వివిధ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడట. దీంతో ఈ మూవీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో బుచ్చిబాబు ఒక బాలీవుడ్ హీరో ను సంప్రదించారట. అయితే ఆ హీరోకి ఈ కథ పెద్దగా నచ్చలేదట. దీంతో ఈ సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆ బాలీవుడ్ హీరో ఎవరంటే చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ అని తెలుస్తోంది. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం మాత్రమే. ఇందులో ఎంత నిజముందనేది తెలియదు. ఇంతకు ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్యలు కూడా పెద్ది సినిమాను రిజెక్ట్ చేశారని రూమర్లు వచ్చాయి.
His GRIT. His GAME. His PRIDE.
Happy Birthday, PEDDI PEHELWAN, aka Mega Power Star @AlwaysRamCharan 💥#PeddiPehelwanGlimpse out now 🔥
▶️ https://t.co/J8nkqVxpCj#HBDRamCharan#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 pic.twitter.com/ImMf3bZQyz— PEDDI (@PeddiMovieOffl) March 27, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.