
రణ్ వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ సినిమా ధురంధర్. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 04న ప్రేక్షకలు ముందుకు వచ్చింది. సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ధురంధర్ సినిమాలో హీరో రణ్‌వీర్ సింగ్ గూఢచారి పాత్రలో అదరగొట్టాడు. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ లాంటి టాప్ స్టార్స్ కూడా తమ నటనతో మెప్పించారు. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ గా ఒకప్పటి ఛైల్డ్ ఆర్టిస్ట్ నాన్న మూవీ ఫేమ్ సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా ఆమెకు ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. ఇందులో సారా అర్జున్ అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాతనే ఆమెకు గుణ శేఖర్ యుఫోరియాలోనూ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.
అయితే ధురంధర్ మూవీలో హీరోయిన్ గా సారా అర్జున్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ బ్యూటీ కంటే ముందు ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని అడిగారట. అయితే ఆ సమయం లో ఆమె వరుసగా రెండు మూడు హిందీ సినిమాల షూటింగ్స్ తో బిజీ గా ఉందట. దీంతో ధరంధర్ సినిమాలో నటించే ఆఫర్ ను వద్దను కుందట. ఈ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నందుకు రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికీ బాధ పడుతూనే ఉందట. ముందుగా అనుకున్న సినిమాల కారణంగా ధురంధర్ సినిమాకు డేట్స్ సర్దుబాటు చేయలేకపోయానని, ఒకవేళ కమిట్మెంట్స్ లేకపోయుంటే కచ్చితంగా ఈ చిత్రం చేసి ఉండేదాడని అంటూ తన స్నేహితులతో చెబుతోందట ఈ ముద్దుగుమ్మ.
కాగా ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లోనే సెటిలైపోయింది. ఇక్కడే వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే సాలిడ్ సక్సెస్ మాత్రం పడడం లేదు. ఈ నేపథ్యంలో ధురంధర్ మూవీ చేసి ఉంటే రకుల్ కెరీర్ గాడిలో పడేదేమోనని సినిమా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి