ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓ వెబ్ సిరీస్ పేరు తెగ వినిపిస్తుంది. అదే 90’s మిడిల్ క్లాస్ బయోపిక్. హీరో శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. 90’s లో పరిస్థితులు ఎలా ఉండేవి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా జీవించేవారు అనేవి ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. శివాజితో పాటు ఈ సిరీస్ లో వాసుకి కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ కు ఆదిత్య అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాట కామెడీ కూడా పేక్షకులను ఆకట్టుకుంది. అలాగే క్యూట్ లవ్ స్టోరీ కూడా చూపించారు. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ లో నటించిన వారిలో మౌళి , వాసంతిక, రోషన్ రాయ్ కీలక పాత్రలో నటించారు.
అయితే వాసంతికా గతంలో ఏ ఏ సినిమాల్లో నటించిందో తెలుసా.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమా గుర్తుందా.? హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే మెహరీన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఈ సినిమాలో నాని తో కలిసి ముగ్గురు చిన్నారులు నటించారు. వారిలో చుట్కీ పాత్రలో నటించిన అమ్మాఅయే వాసంతికా. ఆ సినిమాతర్వాత ఇదిగో ఇలా 90’s వెబ్ సిరీస్ లో కనిపించిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలో ఫోటోను, 90’s వెబ్ సిరీస్ లో ఫోటోను పక్క ప్-పక్కన పెట్టి ఆ అమ్మడే ఈ అమ్మడు అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. వాసంతికా పలు సినిమాల్లోనూ నటించింది. ఇక ఇప్పుడు 90’s వెబ్ సిరీస్ ద్వార మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి