Honey Rose: అందం కోసం ఈ అమ్మడు కూడా సర్జరీ చేయించుకుందా..? హనీ రోజ్ రియాక్షన్ ఇదే

సర్జరీ కొంతమంది అది మరింత అందాన్ని తెచ్చిపెడితే.. మరికొంతమందికి  మాత్రం ఆ ప్రయత్నం బెడిసికొడుతుంది. దాంతో ఉన్న అందం కూడా పోగొడట్టుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో బ్యూటీ కూడా అందం పెంచుకోవడం కోసం సర్జరీ చేయించుకుంది టాక్ వినిపిస్తుంది

Honey Rose: అందం కోసం ఈ అమ్మడు కూడా సర్జరీ చేయించుకుందా..? హనీ రోజ్ రియాక్షన్ ఇదే
Honey Rose

Updated on: Jul 26, 2023 | 4:40 PM

అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఉన్న అందానికి మరిన్ని మెరుగులు దిద్దడానికి సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు కొందరు. కొంతమందికి అది మరింత అందాన్ని తెచ్చిపెడితే.. మరికొంతమంది విషయంలో మాత్రం ఆ ప్రయత్నం బెడిసికొడుతుంది. దాంతో ఉన్న అందం కూడా పోగొట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో బ్యూటీ కూడా అందం పెంచుకోవడం కోసం సర్జరీ చేయించుకుంది టాక్ వినిపిస్తుంది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు హనీ రోజ్. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. నటసింహం నందమూరి  బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చింది.

ఈ సినిమాలో అమ్మడు నటన , అందం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. హనీ అందానికి ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే.

ఆమెను చూస్తూ మైమరిచిపోవడం ఖాయం.. అంతలా తన వయ్యారంతో కవ్విస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ అందం కోసం సర్జరీ చేయించుకుందని ప్రచారం జోరుగా జరుగుతుంది.దాంతో ఈ వార్తల పై స్పందించింది హనీ. తాను అందం కోసం ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు అని తెలిపింది. తనకు అందం అనేది దేవుడు వరంగా ఇచ్చిందని.. ఆ అందం భగవంతుడి సృష్టేనని చెప్పుకొచ్చింది.