Taapsee Pannu: అలాంటి సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకురారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ

తెలుగు తమిళ్ హిందీ భాషల్లో నటిస్తూ దూసుకుపోతోంది హీరోయిన్ తాప్సీ. తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన

Taapsee Pannu: అలాంటి సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకురారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ
Taapsee

Edited By:

Updated on: Jul 28, 2021 | 10:01 AM

Taapsee Pannu: తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ దూసుకుపోతోంది హీరోయిన్ తాప్సీ. తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్‌‌‌గా పరిచయమైన తాప్సీ.. ఆతర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహసం సినిమాలతో మంచి క్రేజ్‌‌‌‌ను సొంతం చేసుకుంది. తెలుగులో రాణిస్తున్న సమయంలోనే ఈ బ్యూటీ బాలీవుడ్‌‌‌‌లో అడుగు పెట్టింది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్‌‌‌‌గా మారిపోయింది. అలాగే తమిళ్‌‌‌‌లోనూ సినిమాలు చేస్తోంది. ఇక ఈ చిన్నది లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంటోంది. తాజాగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది తాప్సీ. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది ఈ చిన్నది.

అలాంటి సినిమాలను జనాలకు చేరువ చేయడంలో చాలా కష్టాలు ఉంటాయని అంటోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేందుకు టాప్ హీరోలు ఒప్పుకోరని… వారి పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని వారు భావిస్తుంటారని అంటోంది. కథ అంతా హీరోయిన్ చుట్టు తిరుగుతూ ఉంటుంది.. దాంతో హీరోల ఇమేజ్ తగ్గిపోతుందని వారు నటించడానికి ఒప్పుకోరని చెప్పుకొచ్చింది తాప్సీ. ఈ విషయంలో అగ్ర హీరోలు వారి మైండ్ సెట్ మార్చుకోవాలని తాప్సీ హితవు పలికింది. ప్రస్తుతం బాలీవుడ్‌‌‌తో పాటు తెలుగు, తమిళంలో తొమ్మిది చిత్రాల్లో నటిస్తోంది తాప్సీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: అందంలోనే కాదు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌లోనూ సూపర్ స్టారే.. వైరల్ అవుతోన్న మహేష్ వర్కౌట్‌‌‌‌ ఫోటో..

Raashi Khanna: సైకో కిల్లర్‌‌‌గా మారనున్న బాబ్లీ బ్యూటీ.. రాశిఖన్నా నయా వెబ్ సిరీస్

Karthika Deepam: మిమ్మల్ని అద్నర్నీ నాశనం చేసేస్తాను..మోనిత శాపం.. ఏదైనా చేసుకో కార్తీక్ స్ట్రాంగ్ రిప్లై!

Loading...
Unable to load recommendations.
Follow Us