Rajeev Rayala |
Feb 20, 2022 | 8:15 PM
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుంది.
భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఓ బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది కాజల్
తన బేబీ బంప్ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది.
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 21 మిలియన్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా కాజల్ తన ఖాతాలో త్రోబ్యాక్ ఫొటోలు షేర్ చేసింది.
‘నా ఇన్ స్టా ఫ్యామిలీకి 21 మిలియన్స్ ప్రేమని అందించినందుకు ధన్యవాదాలు. మీకు 21 మిలియన్ రెట్ల ప్రేమని అందిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిందీ చందమామ.
టాలీవుడ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తారాల్లో కాజల్ కూడా ఒకరు. నిత్యం తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. ఈక్రమంలోనే ఆమె ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.