Honey Rose: వైరల్ అవుతోన్న అందాల హానీ రోజ్ ఓల్డ్ వీడియో.. మాములుగా లేదుగా

|

Feb 06, 2023 | 9:17 AM

మలయాళ హీరోయిన్ అయిన హానీ రోజ్ రీసెంట్ గా టాలీవుడ్ లోకి నిగ పెట్టిన విషయం తెలిసిందే.. నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో ముద్ర వేసింది.

Honey Rose: వైరల్ అవుతోన్న అందాల హానీ రోజ్ ఓల్డ్ వీడియో.. మాములుగా లేదుగా
Honey Rose
Follow us on

హానీ రోజ్.. ఇప్పుడు ఇదే పేరు.. టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోన్న పేరు ఇది. మలయాళ హీరోయిన్ అయిన హానీ రోజ్ రీసెంట్ గా టాలీవుడ్ లోకి నిగ పెట్టిన విషయం తెలిసిందే.. నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో ముద్ర వేసింది. అందం అభినయంతో కట్టపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడికి తెలుగులో వరస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో హానీ రోజ్ నటనకు అందానికి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఇక ఈ అమ్మడు కోసం తెలుగు ప్రేక్షకులంతా సోషల్ మీడియాను గాలిస్తున్నారు.

తాజాగా హానీ రోజ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో హానీ రోజ్ నటించిన మలయాళ సినిమాలోని ఒక సీన్ కు సంబందించిన వీడియో ఇది. ఈ వీడియోలో హానీ రోజ్ మెకానికల్ డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయిన అమ్మాయిగా కనిపించింది.

నిజానికి మెకానికల్ లో అమ్మాయిలు తక్కువగా ఉంటారు. దాంతో అంత అందమైన అమ్మాయి మెకానికల్ లో జాయిన్ అయ్యిందని తెలిసి. ఆ క్లాస్ కుర్రాళ్లంతా ఆమెను మహారాణిలా ట్రీట్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈవీయస్యో పై మీరూ ఓ లుక్కేయండి.