Vishal: ఎంత మంచివాడవయ్యా..! వరలక్ష్మి పెళ్లి పై విశాల్ ఏమన్నారంటే

|

Apr 16, 2024 | 7:27 AM

తెలుగులో మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మగా నటించి మెప్పించింది ఈ చిన్నది. క్రాక్ సినిమా తర్వాత వరలక్ష్మి పేరు మారు మ్రోగింది. ఆ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలోనూ నటించింది వరలక్ష్మి. రీసెంట్ గా హనుమాన్ సినిమాలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Vishal: ఎంత మంచివాడవయ్యా..! వరలక్ష్మి పెళ్లి పై విశాల్ ఏమన్నారంటే
Vishal
Follow us on

వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న నటి. హీరోయిన్ గా తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. అలాగే తెలుగులో లేడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మగా నటించి మెప్పించింది ఈ చిన్నది. క్రాక్ సినిమా తర్వాత వరలక్ష్మి పేరు మారు మ్రోగింది. ఆ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలోనూ నటించింది వరలక్ష్మి. రీసెంట్ గా హనుమాన్ సినిమాలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇదిలా ఉంటే ఇటీవలే వరలక్ష్మీ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.ప్రియుడు నికోలయ్‌ సచ్‌దేవ్‌తో ఈ చిన్నదాని ఎంగేజ్ మెంట్ జరిగింది. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. దాంతో సినీ సెలబ్రెటీలు వీరికి విషెస్ తెలుపుతున్నారు. అయితే వరలక్ష్మీ పెళ్లి పై హీరో విశాల్ కూడా స్పందించారు. గతంలో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేశారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది..

ఓ ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ.. లక్ష్మీకరమైన అమ్మాయితో ఏడడుగులు వేస్తానన్నారు. దాంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జోరుగా సాగింది. అయితే 2019లో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రికి విశాల్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది. దాంతో విశాల్ , వరలక్ష్మీ శత్రువులుగా మారిపోయారు. సోషల్ మీడియా వేదికగా వరలక్ష్మీ విశాల్ పై ఫైర్ అయ్యింది. ఇక తాజాగా వరలక్ష్మీ పెళ్లి గురించి విశాల్ స్పందిస్తూ.. వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవుతున్న వరలక్ష్మికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్నారు. సినిమాల్లో తనను తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడింది. తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరలక్ష్మీ చాలా మంచి వ్యక్తి. ఆమె తల్లిని నేను కూడా అమ్మ అనే పిలుస్తాను.. అని విశాల్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.