Chitram: ఉదయ్ కిరణ్ డెబ్యూ మూవీ చిత్రం సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. 2000లో నిడుదలైన ఒక తెలుగు సినిమా. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు తేజ కూడా పరిచయం అయ్యారు.

Chitram: ఉదయ్ కిరణ్ డెబ్యూ మూవీ చిత్రం సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
Chitram

Updated on: Apr 17, 2023 | 8:43 AM

ఒకప్పుడు లవర్ బాయ్ గా రాణించిన హీరోలో ఉదయ్ కిరణ్ ఒకరు. హీరోగా ఎదుగుతున్న సమయంలోనే ఉదయ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. 2000లో నిడుదలైన ఒక తెలుగు సినిమా. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు తేజ కూడా పరిచయం అయ్యారు. కాలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో హీరోగా ముందుగా ఉదయ్ కిరణ్ ను అనుకోలేదట.

ఉదయ్ కిరణ్ ను ముందుగా హీరో ఫ్రెండ్ రోల్ కోసం తీసుకున్నారట. అయితే ఆసినిమాలో మెయిన్ హీరో సరిగ్గా చేయకపోవడంతో ఆ హీరోను తప్పించి ఉదయ్ ను హీరోగా చేశారట దర్శకుడు తేజ. అంతే కాదు ఉదయ్ కిరణ్ కంటే ముందు తరుణ్ ను హీరోగా అనుకున్నారట.

హీరో తరుణ్ చిత్రం సినిమాలో హీరోగా ఎంపిక అయ్యాడట. అయితే రెమ్యునరేషన్ కారణంగా తరుణ్ ఈ సినిమానుంచి తప్పుకున్నాడట దాంతో ఉదయ్ కిరణ్ ను హీరోగా మార్చారట తేజ. చిత్రం సినిమా తర్వాత ఉదయ్ హీరోగా వరుస సినిమాల్లో నటించి మెప్పించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us