Suriya- Sachin: ఫొటో మూమెంట్‌.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ను కలిసిన సూర్య.. పండగ చేసుకుంటోన్న ఫ్యాన్స్‌

కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య మాస్టర్‌ బ్టాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను కలిశాడు. ప్రస్తుతం తన తర్వాతి సినిమా షూటింగ్‌ కోసం ముంబైలోనే ఉంటున్నాడు సూర్య. అయితే షూటింగ్‌ నుంచి కాస్త విరామం లభించడంతో సచిన్‌ను కలిశాడు.

Suriya- Sachin: ఫొటో మూమెంట్‌.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ను కలిసిన సూర్య.. పండగ చేసుకుంటోన్న ఫ్యాన్స్‌
Suriya Sachin

Edited By: Ravi Kiran

Updated on: Feb 16, 2023 | 6:18 PM

కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య మాస్టర్‌ బ్టాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను కలిశాడు. ప్రస్తుతం తన తర్వాతి సినిమా షూటింగ్‌ కోసం ముంబైలోనే ఉంటున్నాడు సూర్య. అయితే షూటింగ్‌ నుంచి కాస్త విరామం లభించడంతో సచిన్‌ను కలిశాడు. అయితే ఎప్పుడు దిగిందన్నది క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం సచిన్- సూర్య కలిసున్న ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇద్దరు స్టార్స్ కలిసి కనిపించేసరికి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. లైక్స్, కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా సచిన్‌తో కలిసున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకున్న సూర్య ‘రెస్పెక్ట్‌ అండ్‌ లవ్‌’ అని క్యాప్షన్‌ జోడించాడు. మరోవైపు సచిన్‌ కూడా ఇదే ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నాడు. ‘ఈ ఉదయం చాలా ప్రత్యేకమైనది. మిమ్మల్ని (సూర్య) కలవడం చాలా ఆనందంగా ఉంది’ అని తన హ్యాపీనెస్‌ను షేర్‌ చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా ఇటీవల సచిన్, హైదరాబాద్ లో జరిగిన ఈ- కార్‌ రేసింగ్ చూసేందుకు వచ్చాడు. ఇక విక్రమ్‌ సినిమాలో రోలెక్స్‌గా అదరగొట్టిన సూర్య తన 42వ సినిమాతో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ‘సిరుత్తై’ శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటు ‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్‌లోనూ ఓ క్యామియో రోల్‌ పోషించనున్నారు. అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా ఒరిజనల్‌ సినిమాకు దర్శకత్వం వహించిన సుధా కొంగరనే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..