నాకోసం ఎవ్వరూ నిలబడలేదు.. ఆ ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే నావైపు మాట్లాడారు

తెలుగు సినిమా ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు సుమన్. సుమారు 150 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.ముఖ్యంగా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీ ఇచ్చారు సుమన్. అందం, యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ చిరంజీవితో సరితూగాడు.

నాకోసం ఎవ్వరూ నిలబడలేదు.. ఆ ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే నావైపు మాట్లాడారు
Suman

Updated on: Mar 26, 2026 | 10:36 AM

టాలీవుడ్ నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్. ఒకానొకసాయంలో స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు సుమన్. అయితే సుమన్ తన సినీ కెరీర్ లో అత్యున్నత దశలో ఉన్నప్పుడు, ఊహించని కేసు, గుండా యాక్ట్ కింద తప్పుడు కేసులతో అక్రమంగా జైలు పాలయ్యారు. 1985లో నమోదైన ఈ కేసులు ఆయన జీవితాన్ని, కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దాదాపు మూడు సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేసిన సుమన్, చివరకు తనపై మోపబడిన 11 కేసులూ నిరాధారమైనవని కోర్టులో రుజువు చేసుకుని నిర్దోషిగా బయటపడ్డారు. సుమన్ మార్షల్ ఆర్ట్స్ లో నిపుణుడు కావడంతో, యాక్షన్ హీరోగా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. 80, 90 దశకాల్లో స్టార్ హీరోగా ఎదగాల్సిన సుమన్ కెరీర్‌కు ఊహించని కేసుల వల్ల తీవ్ర ఆటంకం ఏర్పడింది.

మనిషి చాలా మంచోడే కానీ అది ఒక్కటే చెడ్డ అలవాటు.. స్టార్ నటుడి గురించి శివాజీ రాజా

తన స్నేహితుల మధ్య ఉన్న కొన్ని సమస్యల కారణంగా కొంతమంది ఉన్నత అధికారులు తనపై అక్రమంగా కేసులు పెట్టారని, ఆ తర్వాత తప్పు తెలుసుకొని వారే కేసులను వెనక్కి తీసుకున్నారని సుమన్ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. గతంలో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ తన జైలు జీవిత అనుభవాలను పంచుకున్నారు. జైల్లో తనను టెర్రరిస్టులు, నక్సలైట్లు ఉన్న ఒక క్లోజ్డ్ గదిలో వేశారని, వారితో చాలా రోజులు గడిపానని తెలిపారు. చదువుకున్న వారు కూడా పరిస్థితుల ప్రభావంతో తప్పులు చేసి జైలుకు వస్తారని, అక్కడ డాక్టర్లు, టీచర్లు వంటి వారిని కూడా చూశానని చెప్పారు. అయితే, జైల్లో తనను టెర్రరిస్టుల మధ్య ఉంచారని తెలియగానే, అప్పుడు ఏదో కేసులో జైలుకు వచ్చిన తమిళనాడు ప్రతిపక్ష నేత కరుణానిధి తన కోసం పోరాడారని సుమన్ గుర్తు చేసుకున్నారు. కరుణానిధి ఒత్తిడితో అధికారులను మార్చాలని ఆదేశించారని, ఆయన పోరాటం వల్లే తనను ఆ క్లోజ్డ్ ప్రిజన్ నుంచి బయటకు తీసుకువచ్చారని సుమన్ వివరించారు.

OTT Movie: ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి భయ్యా..! ట్విస్ట్‌లతో పిచ్చెక్కిపోద్ది..

తన కష్టకాలంలో సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరూ బహిరంగంగా మాట్లాడలేదని, తనకు మద్దతు ఇవ్వలేదని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ మాత్రం తనను నమ్మారని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలో ఎవరూ తన గురించి పబ్లిక్ గా మాట్లాడకపోయినా, భయపడకుండా ఇద్దరు హీరోయిన్లు సుమలత, సుహాసిని – మీడియా ముందుకు వచ్చి తనకు ధైర్యం ఇచ్చారని, తాను అలాంటి వ్యక్తిని కాదని, సుమన్ అలా చేయడని, అలాంటి అవసరం లేదని, చీప్ వ్యక్తి కాదని ధైర్యంగా చెప్పారని సుమన్ కృతజ్ఞతలు తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నటుడు మోహన్ బాబు తన ఇంటికి వచ్చి పెద్ద పూలదండ వేసి, సాయిబాబా ఆశీస్సులు ఉంటాయని ఆశీర్వదించారని సుమన్ గుర్తు చేసుకున్నారు. ఈ కేసు విషయంలో మెగాస్టార్ చిరంజీవిపై వచ్చిన విమర్శల గురించి కూడా సుమన్ స్పందించారు. ఈ కేసుకి చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము మంచి స్నేహితులమని, అభిమానుల మధ్య గొడవలు ఉన్న కారణంగా ఎవరో వార్తను పుట్టించారని, అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే అని ఖండించారు. చిరంజీవి కూడా ఈ విషయంపై ఒకసారి ఘాటుగానే స్పందించారని, తనకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారని సుమన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us