Siddharth Tweet: నెట్టింట తెగ వైరలవుతోన్న హీరో సిద్దార్థ్ లేటెస్ట్ ట్వీట్..

|

Oct 02, 2021 | 9:45 PM

సిద్దార్థ్.. తెలుగు, తమిళ పరిశ్రమల్లో మంచి పేరున్న హీరో. అతడి ఖాతాలో చాలా బ్లాక్‌బాస్టర్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం కెరీర్ పరంగా కొన్ని ఒడిదొడుగులు ఎదుర్కొంటున్నారు.

Siddharth Tweet: నెట్టింట తెగ వైరలవుతోన్న హీరో సిద్దార్థ్ లేటెస్ట్ ట్వీట్..
Hero Siddharth
Follow us on

సిద్దార్థ్.. తెలుగు, తమిళ పరిశ్రమల్లో మంచి పేరున్న హీరో. అతడి ఖాతాలో చాలా బ్లాక్‌బాస్టర్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం కెరీర్ పరంగా కొన్ని ఒడిదొడుగులు ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్‌గా తెలుగులో ‘మహా సముద్రం’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ  సినిమా షూటింగ్ సందర్భంగా ఫైన్ సీక్వెన్స్ సమయంలో గాయపడ్డాడు సిద్ధార్థ్. అతని వెన్నుపూసకు గాయమవ్వడంతో..  చికిత్స కోసం విదేశాలకు వెళ్లి.. విజయవంతంగా సర్జరీ ముగిసిన అనంతరం తిరిగివచ్చాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు సిద్దార్థ్. కాగా తాజాగా ఈ హీరో వేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు..? ” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ సిద్దార్థ్ ఎవరి గురించి వేశాడా అనే చర్చ జరుగుతోంది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కాగా ప్రస్తుతం హైదారాబాద్‌లోనే ఉన్న సిద్దార్థ్ ‘మహా సముద్రం’ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. . ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన  ‘మహా సముద్రం’ మూవీలో  శర్వానంద్ తో కలిసి నటిస్తున్నాడు సిద్ధార్థ్ . ఈ సినిమా అక్టోబర్ 14న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది.

Also Read: విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత

Chay-Sam: ఆ ఇంట ఒదిగిపోయింది.. కానీ అనూహ్యంగా ఏమైంది..?