
ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసారు హీరో రాజశేఖర్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన ఈ మధ్యకాలంలో సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్న రాజశేఖర్. ఆ మధ్య యంగ్ దర్శకులతో సినిమాలు చేశారు. గరుడ వేగ సినిమాతో హిట్ అందుకున్న రాజశేఖర్ ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. మధ్యలో నితిన్ తో కలిసి ఓ సినిమాలో కనిపించారు కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆతర్వాత రాజశేఖర్ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇక ఇప్పుడు ఆయన తిరిగి సినిమాల్లో బిజీకానున్నారు. అయితే ఈసారి హీరోగా కాదు.. ఇన్నాళ్లు హీరోగా అలరించిన రాజశేఖర్ ఇప్పుడు సహాయక పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే శర్వా హీరోగా నటిస్తున్న బైకర్ సినిమాలో హీరో తండ్రిగా కనిపించనున్నారు.
ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్లో రాజశేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. రాజశేఖర్ మాట్లాడుతూ.. నేను మంచి క్యారెక్టర్స్ చేయాలని చాలా కథలు విన్నాను. కానీ ఏది నచ్చలేదు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత డైరెక్టర్ అభిలాష్ గారు ఈ కథ చెప్పారు. ఇందులో క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. శర్వా గారి సినిమాలో చేస్తున్నామంటే సెకండ్ హీరోనే కదా అనే ఒక ఆలోచన ఉండేది. కానీ మా పిల్లలు ఇప్పుడు అన్నీ మారిపోయాని చెప్పారు. ఇప్పుడు దిల్ రాజు గారు అదే మాట్లాడటం వింటే చాలా ఆనందంగా అనిపించింది అన్నారు.
నేను ఇప్పుడు మంచి పాత్రలు చేయడానికి అడ్జస్ట్ అయిపోయాను. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచి పాత్రలు ఉంటే నన్ను పెట్టుకోండి. నాకోసం మంచి క్యారెక్టర్స్ తీసుకుని రమ్మని కోరుతున్నాను. శర్వా గారు వెరీ నైస్ పర్సన్. యు వి క్రియేషన్స్ ట్రీట్మెంట్ అద్భుతం నేను హీరోలాగే వెళ్ళాను. శర్వా గారు వంశి గారు అందరు కూడా నన్ను ఒక హీరోలాగే చూసుకున్నారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఏప్రిల్ 3 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను అన్నారు. ఈకామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ గా మారాయి. ఇప్పటికే కొంతమంది సీనియర్ హీరోలు విలన్స్ గా, సహాయక పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు రాజశేఖర్ కూడా ఓకే చెప్పడంతో ఇక పై ఆయన వరుస సినిమాల్లో బిజీ అవుతారు అంటూ టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.