బన్నీ నెక్ట్స్ మూవీ ఆ డైరెక్టర్‌తోనే

| Edited By:

Jul 23, 2019 | 9:37 PM

తాజాగా అల్లు అర్జున్ మీద వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత వేణు శ్రీరామ్ అండ్ సుకుమార్‌లతో సినిమాలు లైన్‌లో పెట్టారు బన్నీ. రంగస్థలం సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న సుకుమార్ .. మహేష్ బాబుతో సినిమా చేయాల్సి ఉంది. కానీ దాన్ని క్యాన్సిల్ అయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌తో చేయాల్సిన సినిమా కూడా అటకెక్కేలా కనిపిస్తుందని టాక్ […]

బన్నీ నెక్ట్స్ మూవీ ఆ డైరెక్టర్‌తోనే
Follow us on

తాజాగా అల్లు అర్జున్ మీద వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత వేణు శ్రీరామ్ అండ్ సుకుమార్‌లతో సినిమాలు లైన్‌లో పెట్టారు బన్నీ. రంగస్థలం సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న సుకుమార్ .. మహేష్ బాబుతో సినిమా చేయాల్సి ఉంది. కానీ దాన్ని క్యాన్సిల్ అయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌తో చేయాల్సిన సినిమా కూడా అటకెక్కేలా కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. దానికి కారణం బన్నీ, సుక్కూల మధ్యవార్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా బన్నీ తరపునుంచి అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ వచ్చింది. కొందరు కావాలనే ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని బన్నీ,సుకుమార్‌ల మద్య వివాదాలు సృష్టించేలా ట్రై చేస్తున్నారని అంటున్నారు. ఇంతకు ముందు బన్నీ హీరోగా నటించిన ఆర్య, ఆర్య 2, సినిమాలకు సుకుమారే డైరెక్టర్. అప్పటినుంచి వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. ఇకపోతే త్రివిక్రమ్ మూవీ కంప్లీట్ అయ్యాక సుకుమార్ మూవీ సెట్స్ మీదికి వెళ్లనుందనేది సీనీ వర్గాల మాట.