మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో.. మోహన్ బాబు కాలేజీ గేట్లను సెక్యూరిటీ సిబ్బంది గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. మీడియా రిపోర్టర్లకు కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది సూచించారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసివేసినట్లు తెలుస్తోంది. కాగా మంచు మనోజ్ దంపతులు నారావారిపల్లి లో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు.