Bellamkonda Sai Srinivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌‌కు కాబోయే భార్యను చూశారా.. ఏ హీరోయిన్ అందానికి తక్కువ కాదు..!

కావ్య రెడ్డి నివాసంలో జరిగిన ఈ రోకా వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Bellamkonda Sai Srinivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌‌కు కాబోయే భార్యను చూశారా.. ఏ హీరోయిన్ అందానికి తక్కువ కాదు..!
Bellamkonda Sai Srinivas

Edited By:

Updated on: Mar 09, 2026 | 6:27 PM

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒక్కొక్కరుగా ఓ ఇంటి వాళ్లు అవుతూ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఈ పండుగ వాతావరణంలో మరో యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. త్వరలోనే ఆయన కావ్య రెడ్డి అనే యువతిని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ శుభవార్తను కన్ఫర్మ్ చేస్తూ, తాజాగా వీళ్ళ రోకా అంటే ప్రీ ఎంగేజ్‌మెంట్ వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. కావ్య రెడ్డి నివాసంలో జరిగిన ఈ రోకా వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. అలాగే అగ్ర నిర్మాతలు శిరీష్, సాహు గారపాటి, రామ్ ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నాగ వంశీ, కేకే రాధామోహన్, ధీరజ్ మొగిలినేని ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

వీళ్ళతో పాటు హీరోయిన్ సంయుక్త తదితర తారలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత గ్రాండ్‌గా మార్చారు. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. ఇటీవలే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వెంటనే మెగా హీరో అల్లు శిరీష్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టి తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇలా వరుసగా యంగ్ హీరోలందరూ ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకుంటూ సెటిల్ అవుతున్న ట్రెండ్‌లో.. ఇప్పుడు ఆ లిస్ట్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు కూడా చేరిపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ పరంగా కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు.

Bellamkonda Sai Srinivas Ne

ఇటీవలే కిష్కింధపురి సినిమాతో విజయం అందుకున్న ఈ హీరో.. బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదే జోష్‌లో ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ అనే రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఒక పక్క ప్రొఫెషనల్ లైఫ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్, మరో పక్క పర్సనల్ లైఫ్‌లో పెళ్లి వేడుక.. ఇలా శ్రీనివాస్ డబుల్ సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతానికి రోకా వేడుకను మాత్రమే కంప్లీట్ చేసిన ఈ జంట, త్వరలోనే తమ నిశ్చితార్థం.. అలాగే పెళ్లి తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరో పెళ్లికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్‌ను కమ్మేసిన ఈ పెళ్లిళ్ల సీజన్‌లో.. త్వరలో జరగబోయే బెల్లంకొండ వివాహం ఇండస్ట్రీలో మరో బిగ్ వెడ్డింగ్ కానుంది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..

Follow Us