‘తలైవా’ అభిమానిగా హర్భజన్​..!

అద్బుత‌మైన స్పిన్​ మాయాజాలంతో ప్రత్యర్థి జ‌ట్ల‌ను దెబ్బ‌తీసి ఇండియాకు అరుదైన విజ‌యాలు అదించాడు క్రికెటర్​ హర్భజన్ ​సింగ్​. తాజాగా ఆయ‌న‌ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీకి రెడీ అయిపోయాడు.

తలైవా అభిమానిగా హర్భజన్​..!

Updated on: Jul 05, 2020 | 1:26 PM

అద్బుత‌మైన స్పిన్​ మాయాజాలంతో ప్రత్యర్థి జ‌ట్ల‌ను దెబ్బ‌తీసి ఇండియాకు అరుదైన విజ‌యాలు అదించాడు క్రికెటర్​ హర్భజన్ ​సింగ్​. తాజాగా ఆయ‌న‌ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీకి రెడీ అయిపోయాడు. ‘ఫ్రెండ్​షిప్​’ అనే తమిళ మూవీ ద్వారా వెండితెర‌పై సందడి చేయ‌బోతున్నాడు. శనివారం హర్భజన్ బ‌ర్త్ డే సందర్భంగా ఆ మూవీలోని మొద‌టి లిరికల్​ వీడియోను విడుదల చేసింది మూవీ యూనిట్.

‘సూపర్​స్టార్​ ఆంథమ్​’ ఫస్ట్​సింగిల్​ను ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్​ రాఘవ లారెన్స్​ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు. హర్భజన్​ ఇందులో త‌లైవా​ రజనీ ఫ్యాన్​గా నటిస్తున్నాడని ప్ర‌మోష‌న్ వీడియోస్ చూస్తే తెలుస్తోంది. ఈ పాటను తమిళంలో శింబు పాడ‌గా.. తెలుగులో హేమచంద్ర ఆల‌పించాడు. డి.ఎమ్​. ఉదయ్​ మ్యూజిక్ అందించాడు. జేపిఆర్​, స్టాలిన్​ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఫ్రెండ్​షిప్​’ చిత్రానికి… జాన్​ పాల్​ రాజ్​, శామ్ సూర్య దర్శకులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.