
పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొన్నటివరకు తెలుగులో క్రేజీ హీరోయిన్. యంగ్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఎక్కువగా యంగ్ హీరోలతోనే నటించి మెప్పించింది. చాలా తక్కువ కాలంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో చాలా మందికి ఫేవరెట్ యాక్ట్రెస్ గా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాదు తమిళం, కన్నడ భాషా సినిమాల్లోనూ యాక్ట్ చేసిందీ అందాల తార. అయితే ఇదంతా గతం. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన హీరోయిన్ ఇప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది. ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కనిపించి దాదాపు ఐదేళ్లవుతోంది. చివరిగా ఈ బ్యూటీ 2023లో ఓ తమిళ సినిమాలో నటించింది. ఆ తర్వాత కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోంది. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.అలా తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా?
‘ఇవన్ వేరే మాదిరి’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది సురభి. తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన బీరువా సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా, శర్వానంద్ హీరోగా వచ్చిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ మూవీ తో మంచి హిట్ అందుకుందీ అందాల తార. దీని తర్వాత సురభికి ఆఫర్లు క్యూ కట్టాయి. ‘ఎటాక్’ ‘జెంటిల్ మేన్’ ‘ఒక్క క్షణం’ ‘ఓటర్’, ‘శశి’ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే వీటిలో జెంటిల్ మెన్ మాత్రమే సూపర్ హిట్ గా నిలిచింది. మిగతావన్నీ సోసో గా ఆడాయి. తమిళం, కన్నడ భాషల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ హిట్ మాత్రం పడలేదు.
అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభర సినిమాలో సురభి ఓ కీలక పాత్రలో నటించనుంది. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ చాలా రోజులుగా జరుగుతోంది. అయతే ఈ జులైలో ఈ సినిమా విడుదల కావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి సురభి ఆశలన్నీ విశ్వంభరపైనే ఉన్నాయని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.