Actress: ఈ కుందనపు బొమ్మను గుర్తుపట్టారా? వరుస హిట్లతో స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌.. ఒక్కసారిగా సైలెంట్‌

|

Sep 11, 2023 | 9:50 AM

పై ఫొటోలో కుందనపు బొమ్మలా ఎంతో క్యూట్‌గా కనిపిస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఆమె తెలుగులో ఫేమస్ హీరోయిన్‌. స్టార్‌ హీరో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ సొంతం చేసుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఇక తన సినిమా కెరీర్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉంటుందని

Actress: ఈ కుందనపు బొమ్మను గుర్తుపట్టారా? వరుస హిట్లతో స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌.. ఒక్కసారిగా సైలెంట్‌
Tollywood Actress
Follow us on

పై ఫొటోలో కుందనపు బొమ్మలా ఎంతో క్యూట్‌గా కనిపిస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఆమె తెలుగులో ఫేమస్ హీరోయిన్‌. స్టార్‌ హీరో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ సొంతం చేసుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఇక తన సినిమా కెరీర్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉంటుందని భావించారంతా. అయితే ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది. మరి మలయాళీనే అయినా తెలుగులో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నఆమె ఎవరో గుర్తుపట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకొక క్లూ.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మెగా మేనల్లుడు సాయ ధరమ్‌ తేజ్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్ సొంతం చేసుకుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్‌. ఆమె మలయాళ బ్యూటీ సంయుక్తా మేనన్‌. ఇవాళ (సెప్టెంబర్‌ 11) ఆమె పుట్టిన రోజు. అందుకే తన చిన్ననాటి అరుదైన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

చేతిలో డెవిల్ మాత్రమే..

సంయుక్త పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు విషెస్‌ చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. సాయి ధరమ్‌ తేజ్‌ విరూపాక్ష సినిమాలో చివరిగా కనిపించింది సంయుక్త. అంతకు ముందు ధనుష్ తో కలిసి సార్ అనే బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’లో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నిఖిల్‌ స్వయంభూ సినిమాలో కూడా కథానాయికగా ఎంపికైందని తెలుస్తోంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రానుంది. అలాగే కొన్ని మలయాళం సినిమాలకు కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమె పుట్టిన రోజు కావడంతో తన కొత్త సినిమాల అప్డేట్స్‌ కూడా రావచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ తో సంయుక్త

పృథ్వీరాజ్ సుకుమారన్ తో విరూపాక్ష బ్యూటీ

సంయుక్త లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.