Tollywood: పాత్రకు ప్రాణం పోసే హీరో.. ఈ నూనుగు మీసాల కుర్రాడిని గుర్తించగలరా..?

|

Jun 11, 2024 | 9:03 PM

తారల రియల్ లైఫ్ ఎలా ఉంటుంది..? ఎలాంటి ఆహారం తీసుకుంటారు.. ? ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకుంటారు. అలాగే నటీనటుల ఫ్యాషన్ స్టైల్ పై రోజూ ఓ న్యూస్ రావడం ఖాయం. కానీ ఈ మధ్య కాలంలో సినీతరాల చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Tollywood: పాత్రకు ప్రాణం పోసే హీరో.. ఈ నూనుగు మీసాల కుర్రాడిని గుర్తించగలరా..?
Actor 2
Follow us on

సోషల్ మీడియా ప్రపంచంలో సినీతారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్‏గా మారుతుంది. సినిమా అప్డేట్స్ కాకుండా సెలబ్రెటీల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు నెటిజన్స్. తారల రియల్ లైఫ్ ఎలా ఉంటుంది..? ఎలాంటి ఆహారం తీసుకుంటారు.. ? ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకుంటారు. అలాగే నటీనటుల ఫ్యాషన్ స్టైల్ పై రోజూ ఓ న్యూస్ రావడం ఖాయం. కానీ ఈ మధ్య కాలంలో సినీతరాల చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో టీనేజ్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఎవరో తెలుసా..? ఆ కుర్రాడు మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్.

నాలుగు దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మోహన్ లాల్ నటించిన కొన్ని చిత్రాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించాడు. ప్రస్తుతం మోహన్ లాల్ కు సంబంధించిన రేర్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. మోహన్ లాల్ తన తల్లిదండ్రులతో కలిసి నిల్చున్న ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. బెల్ బాటమ్ ప్యాంట్, షర్ట్ ధరించి అప్పట్లో హీరోలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు.

ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో మెప్పించిన మోహన్ లాల్.. రెండుసార్లు ఉత్తమ నటుడితో సహా నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు. మలయాళంతో పాటు తమిళం, హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించాడు. మోహన్‌లాల్ మే 21, 1960న పతనంతిట్ట జిల్లా ఎలంతూరులో విశ్వనాథన్ నాయర్ , విశ్వనాథన్ నాయర్, శాంతకుమారి దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించారు. మోహన్‌లాల్ తండ్రి విశ్వనాథన్ నాయర్ కేరళ సెక్రటేరియట్‌లో న్యాయ విభాగంలో అధికారి. ఇటీవల తన తండ్రి విశ్వనాథన్ నాయర్, తల్లి శాంతకుమారి పేరు మీద విశ్వశాంతి ఫౌండేషన్‌ను ప్రారంభించాడు. మోహన్‌లాల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బర్రోస్’ ఈ ఏడాది సెప్టెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.