Priyanka Chopra: ‘ఆర్ఆర్ఆర్ చూసేంత టైమ్ లేదు’.. ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..

| Edited By: seoteam.veegam

May 18, 2023 | 3:42 PM

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకున్న ఈ సినిమాను ఇప్పటివరకు చూడలేదంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతోంది. అక్కడ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఓ సినిమా ప్రమోషనల్లో పాల్గొన్న ఆమె.. ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Priyanka Chopra: ఆర్ఆర్ఆర్ చూసేంత టైమ్ లేదు.. ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
Priyanka Chopra
Follow us on

ఆర్ఆర్ఆర్… ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సెన్సెషన్ గురించి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా.. విదేశాల్లోనూ భారీగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకున్న ఈ సినిమాను ఇప్పటివరకు చూడలేదంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతోంది. అక్కడ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఓ సినిమా ప్రమోషనల్లో పాల్గొన్న ఆమె.. ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. “ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేందుకు ఇప్పటికీ నాకు సమయం దొరకలేదు. నేను ఎక్కువగా సినిమాలు చూడను.. ఎప్పుడైనా సమయం ఉంటే టీవీల్లో వచ్చే కార్యక్రమాలు చూస్తుంటాను. కొన్ని షోలు మాత్రం క్రమం తప్పకుండా చూసేందుకు ట్రై చేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక రామ్‌ చరణ్‌ను ‘బ్రాడ్‌ పిట్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తున్నారు. ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా అని అడగ్గా.. ‘‘కచ్చితంగా అంగీకరిస్తాను. రామ్‌ చరణ్‌ ఉత్సాహంగా ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. ఒకవేళ మీరు రామ్‌ చరణ్‌, బ్రాడ్‌ పిట్‌ వీళ్లిద్దరిలో ఎవరు అందంగా ఉంటారనే ప్రశ్న అడిగితే.. నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే నేను బ్రాడ్‌ పిట్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. అతడు నా క్రష్‌’’ అని తెలిపింది.

అలాగే రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని తెలిపింది. గతంలో రామ్ చరణ్ హిందీలో నటించిన జంజీర్ చిత్రంలో ప్రియాంక నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో తుపాకీ పేరుతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు సమయం దొరకలేదని ప్రియాంక చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఆర్ఆర్ఆర్ సినిమాను తమిళ్ మూవీ అని చెప్పి ట్రోలింగ్ కు గురైంది ప్రియాంక.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.