
సినిమా ఇండస్ట్రీలో సాంగ్స్ కు ఎంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమాల విజయంలో సాంగ్స్ ఎంతో కొంతం భాగం అవుతుంటాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ సాంగ్స్ సూపర్ హిట్ అవుతుంటాయి. అలాగే కొన్ని సాంగ్స్ రిపీట్ గా వింటూ ఉంటారు. ఇక ప్రస్తుతం సినిమా సాంగ్స్ తోపాటు ప్రయివేట్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఫోక్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఫోక్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇక ఎన్నో సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు పాన్ ఇండియా లెవల్ లో వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఇప్పుడు ఓ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఈ ఫోక్ సాంగ్ ఇప్పుడు మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సాంగ్.. ఆడియన్స్ ఈ సాంగ్‌ను రిపీట్‌గా వింటూ తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకూ ఆ సాంగ్ ఎదో కాదు.. సక్కని నా బావ అలిగిండు అనే పాట తెగ వైరల్ అవుతుంది. ఈ పాటలో డాన్స్ కూడా అదిరిపోతుంది. ఈ సాంగ్ కు ఇప్పటికే 930కే పైగా వ్యూస్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది.
హేమ రెడ్డి ఈ సాంగ్ కు సాహిత్యం అందించారు. ఆమె రాసిన లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే మమత రమేష్ ఈ సాంగ్ ను అద్భుతంగా ఆలపించారు. డీజే శేఖర్ ఇచ్చోడ ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించారు. అలాగే ఈ సాంగ్ లో మాధురి రాథోడ్, రౌడీ హరీష్ నటించి మెప్పించారు. ఈ సాంగ్ లో మాధురి రాథోడ్ తన అందంతో పాటు డాన్స్ కూడా ఆకట్టుకుంది. ఈ సాంగ్ మేకింగ్ కూడా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి