
సాధారణంగా ఒక దేశాధినేత మరొక దేశాన్ని సందర్శించినప్పుడు, చర్చలు సాధారణంగా రక్షణ ఒప్పందాలు, సాంకేతికత, దౌత్ సంబంధాల చుట్టూ తిరుగుతాయి. కానీ ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ మాత్రం ఆసక్తికరంగా రణవీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ గురించి మాట్లాడారు. భారతదేశాన్ని సందర్శించే ముందు తన కొడుకు చెప్పడంతో ‘ధురంధర్’ చూశానని స్టబ్ తెలిపాడు.అంతేకాకుండా, ఈ చిత్రం సీక్వెల్ చూసేందుకు తాను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్స్ మార్చి 4 నుంచి 7 వరకు మన దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా, ప్రముఖ వార్తా సంస్థ ‘ANI’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధురంధర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.. “భారతదేశానికి రాకముందు, నా కొడుకు ‘ధురంధర్’ సినిమా చూడమని అడగడంతో ఇంట్రెస్ట్ గా చూశాను. నాకు సినిమా బాగా నచ్చింది. ఉగ్రవాదంపై పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథ నాకు నిజంగా నచ్చింది. మార్చి 19న విడుదల కానున్న ధురంధర్ సీక్వెల్ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.
‘ధురంధర్ 2: ది రివెంజ్’ సినిమా ట్రైలర్ మార్చి 7న విడుదలైంది . ఈ ట్రైలర్‌లో జస్కిరత్ సింగ్ రంగి పాత్రలో రణ్‌వీర్ సింగ్ అదరగొట్టాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో దుమ్ము రేపాడు. జస్కిరత్ కరాచీ అండర్ వరల్డ్ నమ్మకాన్ని సంపాదించుకున్నాడని ల్యారీలో టెర్రరిజమ్ నెట్‌వర్క్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా చేసుకున్నాని ఈ ట్రైలర్ చూపిస్తుంది. ఈ సీక్వెల్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. హిందీతో పాటు, ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా ఈ మూవీ రిలీజ్ కానుంది.
‘ధురంధర్’ మొదటి భాగంలో రణవీర్ సింగ్ హంజా అనే గూఢచారి పాత్రను పోషించాడు. అతనితో పాటు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, సారా అర్జున్ కూడా విిధ పాత్రలు పోషించారు. ముఖ్యంగా రెహ్మాన్ డకైట్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటన సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను పొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును దాటింది. ఇప్పుడు ధురంధర్ సీక్వెల్ ఏ కొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. ధురంధర్ 2′ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ పెరుగుతున్నాయి, ఈ సినిమా ప్రివ్యూల ద్వారానే రూ.30 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. పివిఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి ప్రధాన మల్టీప్లెక్స్‌లలో ఇప్పటికే 1.60 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.