నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది హాట్ బ్యూటీ హనీరోజ్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ గతంలో తెలుగులో సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆతర్వాత మలయాళం పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. మలయాళంలో హనీ రోజ్ చాలా పాపులర్ నటి. వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. చాలా రోజుల తర్వాత హనీ రాచెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు పలు భాషల్లోనూ విడుదల కానుంది.
సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. హనీ రోజ్ చేసిన అన్ని ఫోటోషూట్‌లు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు ఈ అమ్మడు సినిమాలతో కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే కాలం గడిపేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా హానీ రోజ్ పై ఓ నటి తీవ్ర ఆరోపణలు చేసింది. హనీరోజ్ తప్పుడు దారిలో డబ్బులు సంపాదిస్తుందని ఆమె ఆరోపించింది. ఇంతకూ ఆమె ఎవరంటే ఫరా శిబిలా.
నటి ఫరా శిబిలా హనీరోజ్ గురించి మాట్లాడుతూ.. మనపై మనకు నమ్మకం ఉండాలి.అప్పుడే ముందడుగు వేయాలి. ఎవరైనా సరే ప్రతిభను నమ్ముకోవాలి కానీ శరీరాన్ని కాదు. ఇక హనీ రోజ్ ఇప్పుడు శరీరాన్ని చూపిస్తూ డబ్బు సంపాదిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది. హనీరోజ్ డ్రస్సింగ్ గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఆమె ఫోటో షూట్స్ లో రకరకాల ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగుతుంది. రకరకాల యాంగిల్స్ లో తీసిన ఫోటోలను, వీడియోలను ఆమె స్వయంగా షేర్ చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో అందరూ కూడా తమ శరీరాలను చూపిస్తూ ఎగ్జిబిషన్ పెట్టేస్తున్నారు. హనీరోజ్ కూడా అదే చేస్తుంది అని ఆమె ఆరోపించింది. హనీరోజ్ అమాయకురాలు కాదు. ఆమెకు అన్ని తెలుసు. శరీరాన్ని చూపిస్తూ డబ్బు సంపాదించడం అనేది తప్పు అని నా అభిప్రాయం అని తెలిపింది. మరి దీని పై హాని రోజ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..