బాలీవుడ్ ప్రముఖ మనోజ్ భాజ్‌పాయ్ తను చేస్తున్న వెబ్ సిరీస్‌కు డబ్బింగ్ షురూ చేశారు. ఆయన నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 కోసం డబ్బింగ్ చెబుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ఓ ఫోటోను పంచుకున్నారు. ఈ లాక్డౌన్ అనంతరం వచ్చిన పర్మిషన్స్ తో ఈ వెబ్ సిరీస్‌లో నటించిన నటీనటులు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఇటీవల సమంత కూడా తన రోల్ కు డబ్బింగ్ కంప్లీట్ చేసింది.
సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌గా సీజన్ 1తో గుర్తింపు తెచ్చుకున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అందులోనూ సమంత ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు రావడంతో క్రేజ్ పెరిగింది. ప్రియమణి కూడా ఇందులో ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే.