
విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ రణబాలి సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరూ కలిసి నటించిన రణబాలి సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ముఖ్యంగా విజయ్, రష్మికలపై చిత్రీకరించిన ఏందయ్యా సామీ పాటకు మంచి స్పందన లభించింది. ఈ పాటలో కనిపించిన ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన పాటకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడంతో, తాజాగా ఫుల్ వీడియో సాంగ్‌పై కూడా ఆసక్తి నెలకొంది. అజయ్, అతుల్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శ్వేతా మోహన్, అజయ్ గొగవలే తమ గాత్రంతో ప్రాణం పోశారు.
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రణబాలిగా, రష్మిక జయమ్మగా కనిపించారు. విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన రణబాలికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా విడుదలైన ఏందయ్యా సామీ పాటపై మీరూ ఓ లుక్కేయండి.