Actress Mumtaj : చిక్కుల్లో ఖుషి సినిమా సెకండ్ హీరోయిన్.. పోలీస్ కేసు నమోదు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండి పోయాయి.

Actress Mumtaj : చిక్కుల్లో ఖుషి సినిమా సెకండ్ హీరోయిన్.. పోలీస్ కేసు నమోదు..
Mumtaj

Updated on: May 12, 2022 | 1:05 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)నటించిన ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండి పోయాయి. ఈ సినిమాలో పవన్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. సెకండ్ హీరోయిన్ గా ముంతాజ్(Mumtaj) కనిపించి ఆకట్టుకుంది. తెలుగులో పలు సినిమాల్లో పలు ఐటెం సాంగులు చేసిన ఈ ముద్దుగుమ్మ.. తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి అలరించింది. ఆమధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ముంతాజ్. ఆతర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఇదిలా ఉంటే  తాజాగా ముంతాజ్ పై గృహహింస కేసు నమోదయింది.

వివరాల్లోకి వెళ్తే, ముంతాజ్ ప్రస్తుతం చెన్నైలోని అన్నానగర్ ఉంటోంది. ఆమె ఇంట్లో కొన్నేళ్లుగా ఉత్తరాదికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు పని చేస్తున్నారు. ఇంటిపనులు ఆ మైనర్ లను వాడుకుంటోంది ముంతాజ్. అయితే వీరిలో ఒక బాలిక ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. ముంతాజ్ తమను వేధిస్తోందని, తమను సొంత ఊరికి కూడా పంపడం లేదని పోలీసులకు  ఫిర్యాదు చేసింది. ప్రతి రోజు చిత్ర హింసలు పెడుతోందని, అసభ్యకరంగా మాట్లాడుతుందని  ఆవేదన వ్యక్తం చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు ముంతాజ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇద్దరు బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మరోవైపు ముంతాజ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంపై ముంతాజ్ ఇంకా స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

Kalyani Priyadarshan: క్యూట్ ఫొటోస్‌తో కేక పెట్టిస్తున్న కుర్ర బ్యూటీ.. వైరల్ అవుతున్న కళ్యాణి ప్రియదర్శన్ ఫోటోలు

Prabhas: ప్రభాస్ మారుతి మూవీ ‘రాజా డీలక్స్’ వచ్చేది అప్పుడేనా..