డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించిన చిత్రాల్లో చిరునవ్వుతో ఒకటి. హీరో వేణు తొట్టెంపూడి కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్ మూవీగా నిలిచిన ఈ సినిమా 2000లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి జీ.రాంప్రసాద్ దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ అందించిన డైలాగ్స్ మూవీకి హైలెట్ అయ్యాయి. ఇక ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో వేణు సరసన షహీన్ ఖాన్ హీరోయిన్ గా నటించగా.. సీనియర్ హీరోయిన్ ప్రేమ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతుండగా.. కథానాయికగా కనిపించిన షహీన్ ఖాన్ మాత్రం సినిమాలకు దూరంగా ఉండిపోయారు. చిరునవ్వుతో సినిమా తర్వాత ఈ బ్యూటీ తెలుగులో అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన షహిన్.. వేణు సరసన చిరునవ్వు సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఇక ఇదే సినిమాను తెలుగుతోపాటు కన్నడ, తమిళంలో రీమేక్ చేయగా.. అందులోనూ షహీన్ ఖాన్ నటించింది. చిరునవ్వుతో సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న షహీన్ ఖాన్ ఆ తర్వాత మాత్రం ఆఫర్స్ రాలేదు. కేవలం మూడు సినిమాల్లోనే నటించింది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఒక్కో సినిమా చేసిన షహీన్ ఆ తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
చిరునవ్వు కాకుండా డార్లింగ్ డార్లింగ్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాతో అంతగా గుర్తింపు రాలేదు. సినిమాలకు దూరమైన షహీన్ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. చాలా కాలం తర్వాత షహీన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. ఫ్యామిలీతో ఉన్న ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ షహీన్ ఏమాత్రం మారలేదు. ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.