చేసింది తక్కువ సినిమాలే.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ తమ అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వారిలో ఈ ఫొటోలో కనిపిస్తున్న నటి ఒకరు. ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. తెలుగులోనే కాదు కన్నడ ఇండస్ట్రీలోనూ ఆమె సత్తా చాటింది.

టాలీవుడ్ ఆడియన్స్ హృదయాలను దోచేసింది ఈ కేరళ కుట్టి. మొదటి సినిమాతోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఊహించని రితీలో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆమె జీవితంలో అనుకోని ప్రమాదం ఎదురైంది. ఈ హీరోయిన్ విషయంలో జరిగిన సంఘటనతో సౌత్ మొత్తం ఉలిక్కిపడింది. ఆ ఘటన తర్వాత ఆమె సినీ ప్రయాణం ఆగిపోయింది. తనకు జరిగిన అన్యాయం పై ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తుంది. ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె..ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు.
తనే హీరోయిన్ భావన. బేసుతడి సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన భావన.. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సరసన నటించింది. భావన అసలు పేరు కార్తికా మీనన్. కేరళలోని త్రిస్సూర్ లో జన్మించిన ఈ అమ్మడు.. నమ్మళ్ సినిమా ద్వారా 2002లో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. దాదాపు దశాబ్దంపాటు సాగిన ఆమె సినీప్రయాణంలో ఏకంగా 70 సినిమాల్లో నటించింది. అంతేకాకుండా రెండు కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకుంది. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
శ్రీకాంత్ నటించిన మహాత్మా సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ అదే సమయంలో 2017లో ఆమె ఓ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు అగంతకులు ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వెనుక మలయాళీ సూపర్ స్టార్ దిలీప్ ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ ఈ కేసుపై ఎలాంటి తీర్పు రాలేదు. ఈ ఘటన తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది భావన. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




