Thammudu Movie: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన్ పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ సినిమా హీరోయిన్.. ఏం చేస్తున్నారంటే..

ఈ మూవీ తర్వాత నరసింహ నాయుడు, అధిపతి, అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్, యమదొంగలో స్పెషల్ సాంగ్ చేసింది. అంతేకాకుండా.. కన్నడ, హిందీ, ఉర్దూ, పంజాబీ భాషల్లోనూ యాక్ట్ చేసింది. అయితే తొలి సినిమాతోనే తెలుగులో హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు.

Thammudu Movie: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన్ పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా హీరోయిన్.. ఏం చేస్తున్నారంటే..
Thammudu Movie

Updated on: Apr 12, 2023 | 12:43 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‏లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో తమ్ముడు మూవీ ఒకటి. ఈ సినిమాతో పవన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో ప్రీతి జింగానియా కథానాయికగా నటించింది. క్యూట్ లుక్స్.. ఆకట్టుకునే రూపంతో ఒకప్పుడు యూత్ ఫేవరేట్ హీరోయిన్‏గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. నిజానికి ప్రీతి ముంబై ముద్దుగుమ్మ అయినా.. మలయాళం సినిమాతో ఇంట్రడ్యూస్ కావడమే కాకుండా.. తమిళంలోనూ నటించి మెప్పించింది. కానీ పవర్ స్టార్ సరసన నటించిన తమ్ముడు సినిమానే తనకు బ్రేక్ వచ్చింది.  ఈ మూవీ తర్వాత నరసింహ నాయుడు, అధిపతి, అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్, యమదొంగలో స్పెషల్ సాంగ్ చేసింది. అంతేకాకుండా.. కన్నడ, హిందీ, ఉర్దూ, పంజాబీ భాషల్లోనూ యాక్ట్ చేసింది. అయితే తొలి సినిమాతోనే తెలుగులో హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు.

దీంతో 2008లో పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీతోపాటు.. తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. 42 ఏళ్ల వయసులోనూ గ్లామర్ ఫోటోస్ షేర్ రచ్చ చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రీతి జింగానియా.. మొదట చిత్రనిర్మాత ఫిరోజ్ నడియద్వాలా సోదరుడు ముస్తాక్ ఖాన్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ కొన్ని సమస్యల కారణంగా ఈ జంట తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వా నటుడు దర్శకుడు పర్విన్ దబాస్ ను వివాహం చేసుకున్నారు. వీరికి జైవీర్, దేవ్ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us