సినీరంగంలో మొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన వాళ్లు.. ఇప్పుడు వెండితెరపై హీరోహీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. బాలనటీనటులుగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కొందరు బిగ్ స్క్రీన్ పై స్టార్స్ గా సక్సెస్ అవుతే మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకున్నారు. అందులో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో జై చిరంజీవ సినిమాకు సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో భూమిక, సమీరారెడ్డి హీరోయిన్లుగా నటించగా.. సునీల్, వేణు మాధవ్, బ్రహ్మానందం తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి మేనకోడలుగా నటించిన చిన్నారి గుర్తుందా..?
ఈ సినిమా కథ మొత్తం ఆ అమ్మాయి గురించే ఉంటుంది. ఈ చిత్రంలో చిరు మేనకోడలిగా నటించిన అమ్మాయి పేరు శ్రియ శర్మ. నువ్వు నేను ప్రేమ సినిమాలో సూర్య, జ్యోతిక కూతురిగా నటించింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో బాలనటిగా కనిపించి ప్రేక్షకులకు దగ్గరైన ఆ అమ్మాయి.. ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. శ్రీకాంత్ తనయుడు నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో కనిపించింది. అలాగే గాయకుడి సినిమాలో కథానాయికగా నటించింది. అయితే హీరోయిన్ గా శ్రియకు అంతగా క్రేజ్ రాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరమయ్యింది.
ఇది చదవండి : Tollywood: అటు డాక్టర్.. ఇటు క్రేజీ హీరోయిన్.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు.. ఎవరో తెలుసా..
ప్రస్తుతం ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. హీరోయిన్స్ మించిన అందంతో నెట్టింట గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. చైల్డ్ ఆర్టిస్టుగా నేషనల్ అవార్డ్ అందుకుంది. ప్రస్తుతం లాయర్ ప్రాక్టీస్ చేస్తుంది. ఇటు సినిమాలకు దూరంగా ఉంటూ చదువుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. తాజాగా ఆమె గ్లామర్ ఫోటోస్ వైరలవుతున్నాయి.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.