
2012లో వచ్చిన దండుపాళ్యం సినిమాను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. కన్నడ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అలాగే రికార్డు సెంటర్లలో 100 రోజులకు పైగా ఆడింది. కేవలం కన్నడలోనే కాదు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ దండుపాళ్యం సినిమా సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. క్రైమ్ సినిమాల్లో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన దండు పాళ్యం సిరీస్ లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. దండుపాళ్యం 2 జూలై 2014లో రిలీజ్ కాగా, ఆ వెంటనే దండు పాళ్యం 3 కూడా రిలీజైంది. ఆ తర్వాత చాలా ఏళ్లకు కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన దండుపాళ్య 4 2019లో విడుదలైంది. దండు పాళ్యం సినిమా అంటేనే ఒక క్రూరమైన గ్యాంగ్ కళ్ల ముందు మొదులుతుంది. శ్రీనివాస రాజు తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో పూజా గాంధీ, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, పి. రవిశంకర్, రఘు ముఖర్జీ, ప్రియాంక కొఠారి, జయ దేవ్ మోహన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరీ ముఖ్యంగా దండా పాళ్యం ముఠా నాయకురాలి పాత్రలో లక్ష్మీ అలియాస్ పూజా గాంధీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తూనే క్రూరంగా హత్యలు చేసే ఈ పాత్రలో పూజా అభినయం అందరినీ భయ పెట్టింది. అలాగే కొన్ని సన్నివేశాల్లో అయితే బోల్డ్ గానూ నటించి మెప్పించిందీ అందాల తార.
దండు పాళ్యం సినిమాలో చాలా మొరటుగా, క్రూరంగా కనిపించిన పూజా గాంధీ నిజ జీవితంలో చాలా అందంగా, హుందాగా ఉంటుంది. పూజా గాంధీ 2001లో హిందీ సినిమా ”ఖత్రోన్ కే ఖిలాడి” సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ముంగారు మగ , మిలనా, కృష్ణ, తాజ్ మహల్, బుద్ధివంత, అను, గోకుల, దండుపాళ్యం, దండుపాళ్యం 2 , దండుపాళ్యం 3 తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. విజయవంతమైన సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటించిన పూజ చివరిగా తగ్గేదేలే అనే తెలుగు సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు చేయడం లేదు.
పూజా గాంధీ నవంబర్ 2012లో పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే ఏమైందో కానీ కొన్ని రోజులకే ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత 2023లో పూజా తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త విజయ్ ఘోర్పడేతో కలిసి పెళ్లి పీటలెక్కింది. ప్రస్తుతం తన మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోందీ అందాల తార. ఇక సినిమాలకు దూరమైనా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటోంది పూజా. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. తాజాగా పూజా గాంధీకి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈమె దండుడుపాళ్యం హీరోయినేనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.