
ఇండస్ట్రీలో సినిమాలు కంటే సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాయి. హీరో, హీరోయిన్స్ ఎఫైర్స్ దగ్గర నుంచి పెళ్లి, విడాకులు ఎపుడూ వార్తల్లో వినిపిస్తుంటాయి. ఇక అందాల భామలు చాలా మంది సినిమాలతో కంటే పర్సనల్ విషయాలతోనే హాట్ టాపిక్ గా మారారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ రూటే సపరేట్. అప్పటిలో ఈ అమ్మడు అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. కుర్రకారు డ్రీమ్ గర్ల్ ఆ ముద్దుగుమ్మ. అప్పటిలో టాప్ లెస్ ఫోజులతో టాప్ లేపేసింది. మ్యాగజైన్ పై టాప్ లెస్ ఫొటోలతో ఇండస్ట్రీని షేక్ చేసింది. అంతే కాదు. ఏకంగా మాఫియా డాన్ తోనే రిలేషన్ పెట్టుకుంది. ఆమె చిన్న హీరోయిన్ కాదు. ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది ఈ అమ్మడు. అయితే ఆ నటి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. కట్ చేస్తే సన్యాసిగా మారి షాక్ ఇచ్చింది.
ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? మాఫియా డాన్ తో ఎఫైర్ పెట్టుకుంది. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది.. ఇప్పుడు ఆధ్యాత్మిక బాటలోకి దిగింది. ఆమె మరెవరో కాదు మమతా కులకర్ణి. 90వ దశకంలో తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. బాలీవుడ్ లో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అయితే ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలైంది. మొన్నామధ్య ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెడతారా.? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో నటి పలు విషయాలను వెల్లడించింది. దీంతో పాటు డ్రగ్స్ కేసు విషయాలు కూడా మాట్లాడింది.మమతకులకర్ణి మాట్లాడుతూ.. ‘భారతదేశం నుంచి వెళ్లిపోవడానికి అతిపెద్ద కారణం ఆధ్యాత్మికత.. 1996లో నేను ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాను, ఆ సమయంలో నేను గురు గగన్ గిరి మహరాజ్‌ను కలిశాను. ఆయనను కలిసిన తర్వాత నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది. ‘బాలీవుడ్ నాకు పేరు, సంపదను ఇచ్చిందని నేను ఒప్పుకుంటాను. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆదరణ కోల్పోయాను. నేను చాలా సంవత్సరాలు దుబాయ్‌లో ఉన్నాను. 12 ఏళ్లపాటు బ్రహ్మచారిగా ఉన్నాను. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు నేను సన్యాసిని. నాకు బాలీవుడ్‌పైనా, దేనిపైనా ఆసక్తి లేదు. మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే వయసు కూడా లేదు అని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.