పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే సందడి మాములుగా ఉండదు. ఈసారి అభిమానులను అలరించడానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి రెడీ అయ్యారు పవర్ స్టార్. వీటిలో ముందుగా బ్రో సినిమాతో రానున్నారు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ దేవుడి తరహా పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రాబోతున్నాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారని మీకు తెలుసా..?
ఇంతకు ఆ హీరో ఎవరంటే.. పవన్ కళ్యాణ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన స్టార్ హీరో మరెవరో కాదు.. మాస్ మహారాజ రవితేజ. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా రాణిస్తున్నారు రవితేజ. చాలా సినిమాలకు రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. స్టార్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ, కృష్ణ వంశీ లాంటి స్టార్ దర్శకుల దగ్గర రవితేజ పని చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాకు రవితేజ అసిస్టెంట్ గా పని చేశారు. ఆ సినిమా ఏదంటే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. పవన్ కళ్యాణ్ తొలి సినిమా ఇది. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాకు రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా.. పవన్ కళ్యాణ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
Raviteja