అప్పుడలా.. ఇప్పుడిలా.. ఈ వయ్యారి భామ ఏంటి.. ఇంతలా మారిపోయింది.!

|

Apr 15, 2024 | 1:41 PM

సినీ ఇండస్ట్రీ‌లోకి అడుగుపెట్టిన కొందరు భామలు.. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదిస్తారు. ఒక పది సినిమాల తర్వాత కొందరి హీరోయిన్లకు వచ్చిన క్రేజ్.. వీరు కేవలం సింగిల్ సినిమాతో తెచ్చుకుంటారు. అలాంటి బ్యూటీస్‌లో ఈ భామ కూడా ఒకరు. పైన పేర్కొన్న ఫోటోలోని వయ్యారిని..

అప్పుడలా.. ఇప్పుడిలా.. ఈ వయ్యారి భామ ఏంటి.. ఇంతలా మారిపోయింది.!
Actress
Follow us on

సినీ ఇండస్ట్రీ‌లోకి అడుగుపెట్టిన కొందరు భామలు.. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదిస్తారు. ఒక పది సినిమాల తర్వాత కొందరి హీరోయిన్లకు వచ్చిన క్రేజ్.. వీరు కేవలం సింగిల్ సినిమాతో తెచ్చుకుంటారు. అలాంటి బ్యూటీస్‌లో ఈ భామ కూడా ఒకరు. పైన పేర్కొన్న ఫోటోలోని వయ్యారిని గుర్తుపట్టారా.? ఒక్క సినిమాతో యువతలో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోవడమే కాదు.. లిప్ లాక్ సీన్స్‌లోనూ నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అయితేనేం ఆమె ఫస్ట్ సినిమా రిలీజ్ తర్వాత కుర్రాళ్లందరూ కూడా.. ఇలాంటి లవరే మాకు ఉండాలని కోరుకునేలా తన పాత్రలో జీవించింది ఈ భామ. ఇంతకూ ఆమె మరెవరో కాదు దివ్యభారతి.

తమిళంలో ‘బ్యాచిలర్’ సినిమాతో అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. మొదటి సినిమాలోనే లిప్ లాక్‌లు, బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోయింది. జనవరి 28, 1992లో జన్మించిన ఈ భామ.. తన తొలి సినిమాతోనే యువతలో ఎక్కడలేని క్రేజ్ సంపాదించింది. ‘బ్యాచిలర్’ సక్సెస్ తర్వాత ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ఈమె ఖాతాలో ‘మధిల్ మెల్ కాదల్’, ‘కింగ్‌స్టన్’, ‘ఆసై’, ‘మహారాజా’ వంటి తమిళ సినిమాలు ఉండగా.. సుడిగాలి సుధీర్ సరసన తెలుగులో ‘G.O.A.T – Greatest Of All Time’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే ‘జర్నీ’ అనే వెబ్‌సిరీస్‌లో కూడా ఈ భామ తన నటనతో మెప్పించింది.