వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

తెలుగులో ఎంతో మంచి విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంపత్ రాజ్. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో సంపత్ రాజ్ కు మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!
Sampath Raj

Updated on: Apr 07, 2026 | 8:14 PM

నటుడు సంపత్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. సహాయక పాత్రలే కాదు విలన్ గానూ నటిస్తూ మెప్పిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో సంపత్ రాజ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు. అయితే ఆయన ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న సంపత్ రాజ్ మాజీ భార్య ఓ నటి.. అంతే కాదు ఆమె చాలా పాపులర్ నటి కూడా.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.. తెలుగు, తమిళ్ భాషల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. ఆ నటి మరెవరో కాదు రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ కు తల్లిగా నటించి మెప్పించిన శరణ్య.

తమిళ్ తోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు శరణ్య. ముఖ్యంగా ఆమె హీరో, హీరోయిన్ తల్లి పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. అయితే ఆమె నటుడు సంపత్ రాజ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల గురించి, ముఖ్యంగా తన విడాకులు, సింగిల్ పేరెంట్‌గా తన కూతురిని పెంచిన అనుభవాల గురించి వివరంగా పంచుకున్నారు. తన కూతురు తన జీవితంలో ఎంత కీలకమో వివరిస్తూ, ఆమె తనకు “సాలిడ్ సపోర్ట్” అని, ఆమె మద్దతు లేకుంటే తాను నటుడిగా ఈ స్థాయికి రాలేనని అన్నారు. ఒకవేళ ఆ మద్దతు లేకపోతే తాను తిరిగి తన అడ్వర్టైజింగ్ ఉద్యోగానికే వెళ్ళిపోయి ఉండేవాడినని ఆయన అన్నారు.

సంపత్ రాజ్ తన కూతురు నాలుగు సంవత్సరాల వయసులో తన సంరక్షణలోకి వచ్చిందని, అప్పుడే తాను విడాకులు తీసుకున్నానని తెలిపారు. నటుడిగా మారాలనే తన కోరిక, విడాకుల సమయం, కూతురు బాధ్యతలు స్వీకరించిన సమయం ఒకేసారి వచ్చాయని వివరించారు.  ప్రస్తుతం సంపత్ రాజ్ కూతురు 25 ఏళ్ల వయస్సులో ఉంది. ఆమె మెల్‌బోర్న్, ఆస్ట్రేలియాలో మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఓ హాస్పటల్ లో పని చేస్తుందని తెలిపాడు. అలా తన మాజీ భార్యతో విడిపోవడం అనేది గొడవలు జరిగి కాదని సంపత్ రాజ్ స్పష్టం చేశారు. తాము ఇప్పటికీ మాట్లాడుకుంటామని, తమ కూతురు తన తల్లిని కలుస్తుందని, తన మాజీ భార్య తన ఇంటికి కూడా వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us