Vijay Sethupathi: ఇన్ స్టాలో ఆ హీరోయిన్‏ను మాత్రమే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఇంతకీ ఆమె ఎవరంటే..

విజయ్ సేతుపతి అంటే దక్షిణాది సినీప్రియులకు సుపరిచితమే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు సినీరంగంలోకి అడుగుపెట్టి తొలినాళ్లల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఆ తర్వాత హీరోగా తమిళంలో సక్సెస్ అయిన ఆయన.. ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో రఫ్పాడిస్తున్నాడు. ముఖ్యంగా విలన్ పాత్రలతో ఇరగదీస్తున్నాడు.

Vijay Sethupathi: ఇన్ స్టాలో ఆ హీరోయిన్‏ను మాత్రమే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఇంతకీ ఆమె ఎవరంటే..
Vijay Sethupathi

Updated on: Jun 16, 2025 | 6:51 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. కెరీర్ తొలినాళ్లల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన.. ఇప్పుడు హీరోగా, విలన్ గా తనదైన నటనతో మెప్పిస్తున్నారు. తక్కువ సమయంలోనే కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. నిజానికి తమిళంలో టాప్ హీరోగా ఎదిగిన విజయ్.. ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలోనూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమాలో విలన్ గా కనిపించిన విజయ్ సేతుపతి.. ఆ తర్వాత తెలుగులో ఉప్పెన మూవీలో రాయనం పాత్రలో కనిపించాడు. ఈ సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. ఇటీవలే మహారాజా, ఎస్ చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఆయన.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో విజయ్ సేతుపతి చాలా యాక్టివ్. నిత్యం తన సినిమాల గురించి ఏదోక పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆయనకు ఇన్ స్టాలో 8.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ విజయ్ సేతుపతి మాత్రం ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో ఒకే ఒక్క హీరోయిన్ ఉండడం విశేషం. విజయ్ ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ మరెవరో కాదు.. తెలుగమ్మాయి అంజలి.

ఇవి కూడా చదవండి

సౌత్ ఇండస్ట్రీలో అంజలికి మంచి గుర్తింపు ఉంది. తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. విజయ్ సేతుపతి, అంజలి కాంబోలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో వీరి జోడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంజలి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వకీల్ సాబ్ సినిమాలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..