Romantic Song: సాంగ్ వింటే నరాలు జివ్వుమనాల్సిందే..! కుర్రాళ్లకు కిర్రెక్కించిన పాట

సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటుంటారు. సంగీతానికి వర్షం కురుస్తుందని అంటుంటారు. అందులో నిజమెంతుందో తెలియదు కానీ.. సంగీతం వల్ల మనసుకు ప్రశాంత, హాయి లభిస్తుంది. సినిమాల్లో పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నో రకాల సాంగ్స్ ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో రొమాంటిక్ సాంగ్స్ ఒకటి

Romantic Song: సాంగ్ వింటే నరాలు జివ్వుమనాల్సిందే..! కుర్రాళ్లకు కిర్రెక్కించిన పాట
Song

Updated on: Apr 17, 2026 | 8:19 AM

రకరకాల జోనర్స్ లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీ వాడకం ఎక్కువ కావడంతో ఆడియన్స్ డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాలే కాదు సినిమా సాంగ్స్ కూడా ఊపేస్తున్నాయి. రీసెంట్ గా ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కంటే ముందే ఒకొక్క సాంగ్ విడుదల చేస్తూ వాటికి ఈవెంట్స్ పెడుతున్నారు మేకర్స్. ఒకొక్క సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. కాగా లవ్ సాంగ్స్ కు ఎప్పటికీ క్రేజ్ ఉంటుంది. అలాగే రొమాంటిక్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తూ ఉంటాయి. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా సాంగ్స్ మాత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే సాంగ్స్ వల్ల హిట్ అయినా సినిమాలు బోలెడున్నాయి.

Srihari: ఆ హీరో ఫైట్స్ చేస్తుంటే భయమేసేది.. అందుకే అతని బాధ్యత తీసుకున్నా..!

ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ మాత్రం మాములు సాంగ్ కాదు. సినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ ఆ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. సినిమా విడుదలై 21 ఏళ్లు అవుతుంది. అయినా కూడా ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సినిమా మరేదో కాదు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నరసింహుడు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2005లో విడుదలైంది. ఎన్టీఆర్ కు జోడీగా సమీరా రెడ్డి, అమీషాపటేల్ నటించారు.

అదంతా అబద్దం.. చక్రీ చనిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన రఘు కుంచె

అలాగే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. కాగా ఈ సినిమాలోని ఏలుకో నాయిక సాంగ్ భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఈ రొమాంటిక్ సాంగ్ లో ఎన్టీఆర్, సమీరా రెడ్డి స్టెప్పులేశారు. సమీరా రెడ్డి తన అందంతో ఆకట్టుకోగా తారక్ డాన్స్ తో మెప్పించాడు. ఈ పాటను మల్లికార్జున్, గంగ ఆలపించారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ తెగ వినిపిస్తూ ఉంటుంది. చాలా మంది ప్లే లిస్ట్ లో ఈ సాంగ్ పక్కా ఉంటుంది. యూట్యూబ్ లో మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది ఈ సాంగ్. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పట్లో తెగ చక్కర్లు.. అసలు విషయం చెప్పిన నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us