
ప్రస్తుతం థియేటర్స్ లో చిన్న సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ఓ వైపు సంగీత్ శోభన్ నటించిన రాకాస సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాగే బైకర్ సినిమాతో శర్వానంద్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో ప్రేక్షకులను అలరిస్తుంటే.. మరికొన్ని రోజుల్లో అడవి శేష్ డెకాయిట్ సినిమాతో ప్రేక్షకులక ముందుకు రానున్నాడు. థియేటర్స్ తోపాటు ఓటీటీల్లోనూ సినిమాలు అలరిస్తున్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకుంటూనే.. ఓటీటీల్లోనూ అలరిస్తున్నాయి. ప్రేక్షకులు ఎక్కువగా హారర్,రొమాంటిక్, థ్రిల్లర్ , మిస్టరీ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా ఓటీటీల్లో దుమ్మురేపుతోంది. ఈ సినిమాకు ఏకంగా 49అవార్డులు వచ్చాయి. హీరో, స్పెషల్ సాంగ్స్, ఫైట్స్ లేకుండా ఈ సినిమా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.
ఇంతకూ ఆ సినిమా మరేదో కాదు. బాలీవుడ్ లో తెరకెక్కిన గంగూబాయ్ కతియావాడి. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై 4ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమా ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఈ మూవీలో అలియా భట్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమా రియల్ స్టోరీతో తెరకెక్కింది.
ఈ సినిమాను సంజయ్ లీల బన్సాలీ మాఫియా రాణి గంగూబాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమా కథ విషయానికొస్తే గంగూబాయ్‌ను తన ప్రియుడు రూ.500లకు వ్యభిచార గృహానికి అమ్మేస్తాడు. అక్కడి నుంచి ఆమె రెడ్ లైట్ ఏరియాలో ఇష్టంలేని జీవితం గడుపుతుంది. ఆతర్వాత మాఫియా రాణిగా మారుతుంది. ఆతర్వాత ఆమె జీవితంలో ఎలాంటి సంఘటనలు నెలకొన్నాయో సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతుంది. దాదాపు రూ. 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 200కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది ఈ సినిమా. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అలాగే తెలుగు వర్షన్ యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.