
సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సొంతం చేసుకోవాలనే ఆశతో ఎంట్రీ ఇస్తున్నారు.. ఎంతో మంది ఇండస్ట్రీలో తమను తాము నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. హీరోలు, హీరోయిన్స్, విలన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎంతో మంది సినిమా పై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో అందరూ మంచి వారే ఉండరు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అనేక రకరకాల వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. కొంతమంది అనేక క్రైమ్స్ చేసి జైలు పాలు కూడా అయ్యారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ భర్త చేసిన పని ఇండస్ట్రీని షేక్ చేసింది. ఏకంగా ఓ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్ చేయించాడు అతను. దాంతో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు అతను. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఓ హీరోయిన్ మీద పగపెంచుకొని ఆమెను కిడ్నప్ చేయించి ఆ పై గ్యాంగ్ రేప్ చేయించాడు అతను.
అతను ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో దిలీప్ కుమార్. అతను మంజు వారియర్ మాజీ భర్త. అతను కిడ్నప్ చేయించిన హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ భావన. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది భావన. గోపీచంద్ హీరోగా నటించిన ఒంటరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆతర్వాత నితిన్ హీరో, శ్రీకాంత్ మహాత్మ, రవితేజ నిప్పు సినిమాల్లో నటించింది. అయితే దిలీప్, మంజువారియర్ విడిపోవడానికి భావన కారణమని ఆయన పగ పెంచుకొని ఆమె పై లైంగిక దాడి చేయించాడు.
దిలీప్, కావ్య మాధవన్, భావన కలిసి ఓసారి యూఎస్ టూర్ కు వెళ్లారు. అక్కడ దిలీప్, కావ్య మాధవన్ క్లోజ్ గా ఉండటంతో పాటు.. ఆ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని భావనకు తెలిసింది. ఆ తర్వాత మంజుకు కూడా దిలీప్ పై అనుమానం వచ్చింది. దాంతో మంజు భావనను పిలిచి క్లారిటీ తీసుకుంది. ఆ తర్వాత ఆమె దిలీప్ కు విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత దిలీప్, కావ్య మాధవన్ పెళ్లి చేసుకున్నారు. అయితే మంజు వారియర్ తో విడిపోవడానికి భావన కారణమని కోపంతో భావన పై లైంగిక దాడి చేయించాడు దిలీప్. ఈ కేసులో దిలీప్ మూడు నెలలు జైల్లోనూ ఉన్నాడు. ఇప్పుడు అతను బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇప్పటికీ కోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి