Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ భార్య గురించి మీకు తెలుసా.. బ్యాగ్రౌండ్‌, ట్యాలెంట్‌.. మామూలుగా లేదుగా..

|

Aug 09, 2022 | 2:22 PM

కెరీర్ ఇనీషియల్ స్టేజ్‌ నుంచి.. హీరోగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్.. తాజాగా బింబిసార మూవీతో .. సూపర్ డూపర్ హిట్‌ కొట్టారు. థియేటర్లకు జనాలు రాని సిట్చూవేషన్‌ను పూర్తిగా మార్చేసి.. ఇండస్ట్రీలో కొత్త ఆశలు చిగురించేలా చేశారు.

Nandamuri Kalyan Ram:  కళ్యాణ్ రామ్ భార్య గురించి మీకు తెలుసా..  బ్యాగ్రౌండ్‌, ట్యాలెంట్‌.. మామూలుగా లేదుగా..
Kalyan Ram Wife
Follow us on

కెరీర్ ఇనీషియల్ స్టేజ్‌ నుంచి.. హీరోగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram).. తాజాగా బింబిసార మూవీతో .. సూపర్ డూపర్ హిట్‌ కొట్టారు. థియేటర్లకు జనాలు రాని సిట్చూవేషన్‌ను పూర్తిగా మార్చేసి.. ఇండస్ట్రీలో కొత్త ఆశలు చిగురించేలా చేశారు. అంతేకాదు నెట్టింట మోస్ట్ సెర్చింగ్ స్టార్ గా కూడా మారిపోయారు. ఎస్ ! తాజాగా నందమూరి తమ్ముళ్లతో పాటు.. తెలుగు ఫిల్మ్ లవర్స్ కూడా.. కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ డీటెయిల్స్.. గురించి ఇంట్రెస్టింగ్‌గా సెర్చ్‌ చేస్తున్నారు. అలా సెర్చ్‌ చేస్తూనే.. కళ్యాణ్ రామ్‌ వైఫ్ స్వాతి గురించి తెలుసుకుని షాకవుతున్నారు. తన టాలెంట్‌కి ఫిదా అవుతున్నారు.

పెద్దలు కుదిర్చిన పెళ్లితో ఒక్కటైన స్వాతి, కళ్యాణ్‌ రామ్‌లు చాలా అన్యోన్యంగా ఉంటారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అంతేకాదు పెళ్లి చూపుల్లో స్వాతిని మొదటిసారిగా చూసిన కళ్యాణ్ రామ్… తననే పెళ్లి చేసుకుంటా అంటూ పట్టుబట్టారట. ఇక ప్రొఫెషనల్‌గా డాక్టర్ అయిన స్వాతి.. ఫాదర్ కొసరాజు పెద్ద బిజినెస్ మేన్. తనుకు ఫార్మాకు సంబంధిన అనేక వ్యాపారాలున్నాయి. ఇక అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన స్వాతి.. కళ్యాణ్ రామ్‌ కోసం తన పిల్లల కోసం కొన్నాల్లు తన కెరీర్‌ను వదులుకున్నారు. ఆ తరువాత ఓ వీఎఫ్‌ఎక్స్ సంస్థను స్థాపించి ఇప్పుడు ఆ వ్యవహారాలు చూసుకుంటున్నారు. బింబిసార సినిమాలోని విజువల్ ఎఫెక్స్ ను కూడా తన వీఎఫ్ఎక్స్ సంస్థ నుంచే చాలా తక్కువ టైంలో అవుట్‌ పుట్ ఇచ్చారు. కళ్యాన్ రామ్‌ తో శభాష్ అనిపించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి