నటి రమాప్రభ అల్లుడు తెలుగులో తిరుగులేని హీరో.. 200లకుపైగా సినిమాలు.. ఆయన ఎవరంటే

ప్రముఖ నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు రమాప్రభ. వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రమా ప్రభ. వయో భారంతో ఆమె సినిమాలకు దూరం అయ్యారు. 79ఏళ్ల రమాప్రభ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

నటి రమాప్రభ అల్లుడు తెలుగులో తిరుగులేని హీరో.. 200లకుపైగా సినిమాలు.. ఆయన ఎవరంటే
Rama Prabha

Updated on: Apr 22, 2026 | 8:52 AM

ఎన్నో సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు సినిమా ఇండస్ట్రీలో ఆమెది ఒక ప్రత్యేక గుర్తింపు.. నటిగా, లేడీ కమెడియన్ గా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె.. ఆమె ఎవరో కాదు సీనియర్ నటి రమాప్రభ. వందల సినిమాల్లో నటించి మెప్పించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి నటిగా మెప్పించారు. ప్రస్తుతం వయసురీత్యా ఆమె సినిమాల్లో నటించడం లేదు.. హీరోయిన్ గా చేసి మెప్పించిన రమాప్రభ ఆతర్వాత లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సహాయక పాత్రల్లోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, అమ్మ , అత్త, బామ్మ పాత్రల్లో నటించి అలరించారు రమాప్రభ. ఇక శరత్ బాబుతో పెళ్ళి, విడాకులు రమా ప్రభ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. ఆ మధ్య రమాప్రభ ఆరోగ్యం బాలేదు, దీన స్థితిలో ఉన్నారు అంటూ రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి.

ఇది కూడా చదవండి :  Pokiri: ఎన్నాళ్లకు కనిపించింది మావ..! పోకిరి రౌడీ గర్ల్ ఎంత మారిపోయింది..!!

ఈ వార్తలను రమాప్రభ ఖండించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రమాప్రభ యూట్యూబ్ ద్వారా తన అనుభవాలను, సినీ ప్రముఖాలతో ఆమె పరిచయాలను పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే రమాప్రభ మేనల్లుడు ఇండస్ట్రీలో తోపు నటుడు అని మీకు తెలుసా.? ఆయన 200లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన ఎవరో కాదు కింగ్ ఆఫ్ కామెడీ, నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా , నటుడిగా, ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్.

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. పగబట్టి కెరీర్ నాశనం చేసిన హీరో.. చనిపోయాక శవాన్ని కూడా వదల్లేదు..

ఇప్పటికీ సపోర్టింగ్ రోల్స్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఈ మధ్యన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలిచారు నట కిరిటీ. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్, రమా ప్రభల మధ్య ఉన్న బంధుత్వం గురించి చాలా మందికి తెలియదు.  ఆయన రమా ప్రభకు అల్లుడు వరస అవుతారు. రమా ప్రభ కు పిల్లలు లేరు. దాంతో  తన చెల్లెలి కూతురిని దత్తత తీసుకుంది. తనే పెంచి పెద్దది చేసింది. ఆ తర్వాత తనే దగ్గరుండి రాజేంద్ర ప్రసాద్‌ తో తన చెల్లెలి కూతురి పెళ్లి కూడా చేసింది. అలా రమా ప్రభకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: జబర్దస్త్‌లో 180 ఎపిసోడ్స్ చేశా.. ఇప్పుడు అవకాశాలు లేవు.. ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us