హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి.. ఎవరో తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు..

టాలీవుడ్ లో ఉన్న హ్యాండ్సమ్ హీరోల్లో శ్రీకాంత్ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభంలో విలన్ గా నటించిన అతను ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా విలన్ గా, సహాయక నటుడిగానూ మెప్పిస్తున్నాడు. ఇక శ్రీకాంత్ ఫ్యామిలీలో చాలా మందికి సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉంది

హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి.. ఎవరో తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు..
Srikanth

Updated on: Mar 05, 2026 | 2:29 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులను చూస్తూ ఉంటాము. వారి నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కానీ, అలాంటి నటీనటులలో కొంతమంది ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో మనకు తెలియకుండానే ఉండిపోతుంది. అయితే, కొన్ని కుటుంబ నేపథ్యాలు వెలుగులోకి వచ్చినప్పుడు అవి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.  టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కుటుంబం గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలతో, విలన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రీకాంత్, ఆ తర్వాత తనదైన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఎక్కువ.  దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని తనదైన శైలిలో శాసించారు. నేటికీ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

కెరీర్ ప్రారంభంలో చిన్న నటుడిగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా అలరించి, తర్వాత హీరోగా మారి భారీ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అనంతరం సహాయ నటుడిగానూ రాణిస్తున్నారు. శ్రీకాంత్ గారితో పాటు, ఆయన భార్య ఊహా కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. శ్రీకాంత్‌తోనే కొన్ని సినిమాల్లో నటించి, ప్రేమలో పడి, పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమయ్యారు. వీరి తర్వాత తరం, అంటే శ్రీకాంత్ కుమారుడు రోషన్ కూడా సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు. నిర్మల కాన్వెంట్, పెళ్లి సందడి సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన రోషన్, కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఛాంపియన్ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

అయితే ప్రముఖ నటి, యాంకర్ అనితా చౌదరి స్వయానా శ్రీకాంత్‌కు కజిన్ అవుతారని తెలుస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం అంటున్నారు. అనితా చౌదరి తన కెరీర్‌ను జెమిని టీవీలో ఓ ప్రోగ్రాంతో యాంకర్‌గా ప్రారంభించి, కొన్ని దశాబ్దాల పాటు బుల్లితెరను ఏలారు. పలు డైలీ సీరియల్స్‌లోనూ నటించారు. స్టార్ యాంకర్‌గా, సీరియల్ యాక్ట్రెస్ గా రాణిస్తూనే, ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి సహాయ నటిగా దాదాపు 100కు పైగా చిత్రాలలో నటించారు. ఛత్రపతి, రాజా, ఆనందం, సంతోషం, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, మన్మథుడు వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. అనితా చౌదరి, శ్రీకాంత్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం ఏమిటంటే, ఆమె భర్త కృష్ణ చైతన్య స్వయానా శ్రీకాంత్ కు కజిన్ అవుతారట. వారి పెళ్లిని శ్రీకాంత్, ఊహా దంపతులే దగ్గరుండి జరిపించారట. అలా శ్రీకాంత్, అనితా చౌదరికి కజిన్ అవుతారు. అనితా చౌదరి ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. అలాగే వారి పెళ్లిని శ్రీకాంత్, తన అక్క ఊహా దగ్గరుండి జరిపించారని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us