Mahesh Babu: ‘గుంటూరు కారం’ కోసం మహేష్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ అంత తక్కువా ?.. అస్సలు ఊహించి ఉండరు..

ఈ సినిమాలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. హారిక & హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు, షూటింగ్ ఫోటోస్, వీడియోస్ నిత్యం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఎప్పటికప్పుడు గుంటూరు కారం మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.

Mahesh Babu: గుంటూరు కారం కోసం మహేష్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ అంత తక్కువా ?.. అస్సలు ఊహించి ఉండరు..
Guntur Kaaram

Updated on: Jan 10, 2024 | 7:48 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ డ్రామా గుంటూరు కారం. ఈ సినిమాలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. హారిక & హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు, షూటింగ్ ఫోటోస్, వీడియోస్ నిత్యం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఎప్పటికప్పుడు గుంటూరు కారం మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. అంతేకాదు..ఈసారి గురూజీ మాస్ కంటెంట్‏తో మహేష్ ను సరికొత్తగా చూపించబోతున్నారు. దీంతో ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఈ మూవీపై మరింత హైప్ పెరిగిపోయింది. ప్రస్తుతం గుంటూరు కారం టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ఇదిలా ఉంటే.. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా కోసం మహేష్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో మహేష్ ఒకరు. కానీ ఈ సినిమా కోసం కేవలం రూ.40-50 కోట్లు వరకు మాత్రమే తీసుకుంటున్నాడట. నిజానికి మహేష్ ఒక్కో సినిమా కోసం రూ. 70 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు గుంటూరు కారం కోసం మాత్రం రూ. 40-50 కోట్లు తీసుకుంటున్నాడని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

ఈ సినిమాను రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు (2005) మరియు ఖలేజా (2010) వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి మహేష్ బాబు చేస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ మరియు బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.