పాన్ ఇండియా హీరోప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆది పురుష్. రామయాణం నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ మహా కావ్యాన్ని తెరకెక్కించారు. కృతి సనన్ సీతగా కనిపించనుంది. మొదట్లో ఆది పురుష్ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్‌పై భారీగా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా రావణుడి గెటప్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు రాజకీయ నాయకులైతే ఏకంగా సినిమాను నిషేధిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఆ విమర్శలన్నింటినీ తిప్పికొడుతూ ఇటీవలే గ్రాండ్‌గా ట్రైలర్ రిలీజైంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది ఆది పురుష్ ట్రైలర్. గతంలో విడుదలైన టీజర్ కన్నా వంద రెట్లు మెరుగ్గా ప్రభాస్ మూవీ ట్రైలర్ ఉందంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న అది పురుష్ జూన్ 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే. ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కాదట. డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను అనుకున్నారట. రాముడి పాత్రలో హృతిక్ కనిపిస్తే
బాగుంటుందని భావించారట. అనుకున్నట్లుగానే హృతిక్‌కి కథ మొత్తం వినిపించారట. అయితే సినిమా కథలో మార్పులు చేయాలని డైరెక్టర్‌కు సూచించారట హృతిక్. అయితే దీనికి ఓం రౌత్ ఇష్టపడలేదట. దీంతో అప్పటికే బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా పాపులరైన ప్రభాస్‌ను ఎంచుకున్నారట. అలా ఆది పురుష్ సినిమా ప్రభాస్ దగ్గరకు వచ్చిందట
కాగా ఆదిపురష్ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు. కాగా ఈ సినిమాలో సీత పాత్రకు కృతి సనన్ కంటే ముందు పలువురు హీరోలను అనుకున్నారట. ముందుకా దీపికా పదుకొణెను తీసుకుందామని మేకర్స్ భావించారట. అయితే అదే సమయంలో ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉందట. ఆ తర్వాత అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు కూడా పరిశీలించారట. అయితే చివరకు కృతిని ఓకే చేశారట.
మరిన్ని సినిమా వార్తల కోసం.. క్లిక్ చేయండి.